Bihar: మద్యానికి బానిసైన భర్త వేధింపులు భరించలేక, తరుచుగా ఇంటికి వచ్చే లోక్ రికవరీ ఏజెంట్‌ని ఓ మహిళ ప్రేమించి వివాహం చేసుకుంది. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఇంద్ర కుమారికి 2022లో జముయి జిల్లా నివాసి నకుల్ శర్మతో విహహం జరిగింది. నకుల్ మద్యానికి బానిస కావడంతో, తరుచుగా భార్యని వేధించే వాడు. శారీరక, మానసిక వేధింపులు భరించలేక అతడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించింది.
Read Also: Vallabhaneni Vamsi Wife: పోలీస్స్టేషన్ లోపలికి వంశీ భార్యను అనుమతించని పోలీసులు..
ఆ సమయంలోనే, ఆమెకు ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్న పవన్ కుమార్ యాదవ్ అనే లోన్ రికవరీ ఏజెంట్‌తో పరిచయమైంది. నకుల్ తీసుకున్న రుణం వసూలు చేసేందుకు పవన్ తరుచుగా అతడి ఇంటికి వెళ్లేవారు. ఇది కాల క్రమేణా ఇంద్రకుమారి, పవన్ మధ్య సంబంధాన్ని పెంచింది. ఇది ప్రేమకు దారి తీసింది. 5 నెలల పాటు ఇద్దరూ తన సంబంధాన్ని రహస్యంగా కొనసాగించారు. ఫిబ్రవరి 4న, ఇద్దరూ విమానంలో పశ్చిమ బెంగాల్‌లోని అసన్‌సోల్ వెళ్లారు.
జముయికి తిరిగి వచ్చే ముందు వరకు కొన్ని రోజులు అక్కడే ఉన్నారు. ఫిబ్రవరి 11న వారు ఒక ఆలయంలో వివాహం చేసుకున్నారు. వీరిద్దరి వివాహానికి చాలా మంది హాజరయ్యారు. తర్వాత ఈ పెళ్లి వైరల్‌గా మారింది. పవన్ కుటుంబం వివాహానికి అంగీకరించినప్పటికీ, ఇంద్ర కుమారి కుటుంబం వ్యతిరేకించింది. పవన్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఇంద్ర తన సొంత ఇష్టానుసారం పవన్‌ని పెళ్లి చేసుకున్నట్లు పోలీసులకు తెలిపింది. ఈ నూతన జంటకు బెదిరింపులు రావడంతో, అధికారుల నుంచి రక్షణ కోరుతున్నారు. ఇంద్ర కుమారి తన బంధువుల నుంచి ప్రతీకారం ఎదురవుతుందని, సామాజిక వ్యతిరేకత వస్తుందని భయపడుతోంది.