Site icon NTV Telugu

Pakistan: పాకిస్తాన్‌కు మోదీ కావాలి.. నవాజ్, ఇమ్రాన్ వద్దు.. వైరల్ అవుతున్న వీడియో..

Pakistan

Pakistan

Pakistan Economic Crisis- Viral Video: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ ప్రజలకు భారత్ విలువ తెలుస్తోంది. మాకు నరేంద్రమోదీ లాంటి ప్రధాని కావాలంటూ అక్కడి ప్రజలు కోరుకుంటున్నారు. ఇటీవల పాకిస్తాన్ జర్నలిస్ట్, యూట్యూబర్ సనా అమ్జాద్ ఓ యువకుడిని ‘‘ పాకిస్తాన్ నుంచి బతికి బట్టకట్టాలంటే మనం ఇండియాకు వెళ్లాలి’’ అని ఎందుకు నినాదాలు చేస్తున్నారని ప్రశ్నించిన సందర్భంలో ఆతను చెప్పిన సమాధానం ప్రస్తుతం రెండు దేశాల్లో వైరల్ గా మారింది.

Read Also: Surrogacy Mother: 56ఏళ్ల వయసులో మనవడికి జన్మనిచ్చిన నాయనమ్మ

తమకు ఇమ్రాన్ ఖాన్, నవాజ్ షరీఫ్, జెనజీర్, ముషారఫ్ వద్దని తమకు కేవలం నరేంద్ర మోదీ కావాలంటూ ఆ యువకుడు చెప్పిన మాటలు ఇటు ఇండియాలో, అటు పాక్ లో వైరల్ అవుతున్నాయి. పాక్ ప్రధాని షెషబాజ్ షరీఫ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. మోదీ పాకిస్తాన్ ప్రధాని అయితే పాక్ ప్రజలకు కూడా తక్కువ ధరకే ఆహార పదార్థాలు, కూరగాయలు దొరికేవని అన్నాడు. తాను పాకిస్తాన్లో పుట్టకుంటే బాగుండేదని నిరుత్సాహంతో చెప్పడం వీడియోలో చూడవచ్చు.

మోదీ మనకన్నా గొప్పవాడు, ఆయన ప్రజలను ఎంతగానో గౌరవిస్తారు. పాకిస్తాన్ కు కూడా నరేంద్ర మోదీ ఉంటే నవాజ్ షరీఫ్, బెనజీర్చ ఇమ్రాన్ అవసరం లేదని, మనకు కావాల్సినవి ప్రధాని మోదీ మాత్రమే తీర్చుతారని అన్నారు. భారత్ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది, పాకిస్తాన్ ఎక్కడ లేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. మోదీ గొప్పవ్యక్తి అని, చెడ్డ వ్యక్తి కాదని అన్నాడు. భారతీయులకు కిలో టొమాటోలు రూ. 20కి, కిలో చికెన్ రూ. 150కి లభిస్తున్నాయని.. మనం మాత్రం రాత్రి పూట పిల్లలకు ఆహారం ఇవ్వలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక దేశంగా ఉంటే మనం కూడా భారతీయ ముస్లింల లాగే ఉండేవాళ్లమని దీంట్లో తేడా ఏముంటుందని ప్రశ్నించారు. భారత దేశంతో స్నేహం చేస్తే టొమాటోలు, చికెన్ చవకగా లభిస్తాయని పాక్ ప్రభుత్వానికి సూచించాడు. పాక్, భారత్ ఒకే దేశంగా ఉంటే బాగుండేది అని అన్నాడు.

Exit mobile version