NTV Telugu Site icon

Maharashtra Bus Fire: మహారాష్ట్ర బస్సు అగ్నిప్రమాదం.. 25 మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణం ఇదే కావచ్చు..

Maharashtra Bus Fire

Maharashtra Bus Fire

Maharashtra Bus Fire: మహారాష్ట్రలో ఘోర బస్సు అగ్నిప్రమాదంలో 25 మంది సజీవ దహనం అయ్యారు. ఈ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రధాని నరేంద్రమోడీ సంఘటనలో మరణించిన వారికి సంతాపం వ్యక్తం చేశారు. మహరాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బుల్దానా జిల్లాలో సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వేపై శనివారం తెల్లవారుజామున జరిగిన బస్సు ప్రమాదం జరిగింది. మొత్తం 33 మంది ప్రయాణికుల్లో 8 మంది ప్రాణాలతో బయటపడ్డారు. బస్సు నాగ్‌పూర్ నుంచి పూణే వెళ్తున్న సమయంలో అగ్నికి ఆహుతైంది.

ఈ ప్రమాదానికి ‘‘మానవ తప్పిదమే’’ కారణమని మహారాష్ట్ర పోలీసులు అనుమానిస్తున్నారు. టైర్ పగిలిపోవడంతో నియంత్రణ కోల్పోయిన డివైడర్ ని ఢీకొట్టిందని, ఆ తరువాత బస్సుకు మంటలు అంటుకున్నాయని డ్రైవర్ చెప్పాడు. అయితే ఇందుకు విరుద్ధంగా డ్రైవర్ నిద్రమత్తులో ఉన్న సమయంలో ప్రైవేట్ స్లీపర్ కోచ్ అయిన బస్సుపై నియంత్రణ కోల్పోయిన ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. డిజిల్ ట్యాంకర్ పగిలిపోవడంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించినట్లు ప్రాథమిక నివేదిక చెబుతోంది.

Read Also: Elections Survey: దేశంలో ఇప్పటికప్పుడు ఎన్నికలు వస్తే బీజేపీదే అధికారం.. తెలంగాణ, ఏపీలో పరిస్థితి ఇదే..

నాగ్‌పూర్ నుంచి పూణేకి మొత్తం 33 మంది ప్రయాణికులతో బస్సు బయలుదేరింది. తెల్లవారుజామున 1.30 గంటలకు సింధ్‌ఖేడ్రాజా సమీపంలోని పింపాల్‌ఖుటా గ్రామంలో బస్సు ప్రమాదానికి గురైంది. బస్సు డ్రైవర్, క్లీనర్ తో సహా 8 మంది పగిలిన కిటీకీల నుంచి బయటకు రావడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. మిగిలిన 25 మంది సజీవ దహనమయ్యారు. బస్సు ముందుగా యవత్మాల్ జిల్లా కరంజా వద్ద భోజనం కోసం ఆగింది. కేవలం రెండున్నర గంటల్లోనే బస్సు ఏకంగా 150 కిలోమీటర్ల ప్రయాణించినట్లు తెలుస్తోంది. బస్సు యావరేజ్ స్పీడ్ గంటకు 60-70 కిలోమీటర్లు ఉందని పోలీసులు తెలిపారు.

బస్సు వేగం ప్రమాదానికి కారణం కాకపోయి ఉండొచ్చని.. మానవ తప్పిదమే ప్రమాదానికి కారణమని తెలుస్తోందని పోలీసులు వెల్లడిస్తున్నారు. డ్రైవర్ నిద్రపోయి ఉండొచ్చని.. బస్సు ముందుగా కుడి వైపు వెళ్లి ఆ తరువాత క్రాష్ బారియర్ను, ఆపై డివైడర్ ని ఢీకొట్టిందని అనుమానిస్తున్నారు. ఘటన స్థలంలో టైర్ పగిలిన ఆనవాళ్లు, టైర్ గుర్తులు, రబ్బర్ ముక్కలు లేవని అమరావతి ప్రాంతీయ రవాణా కార్యాలయం నివేదిక పేర్కొంది.