NTV Telugu Site icon

Delhi: ఎయిర్‌పోర్టులో రూ.11కోట్ల గంజాయి పట్టివేత.. లేడి కిలాడి అరెస్ట్

Delhi International Airport

Delhi International Airport

ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా విదేశీ గంజాయి పట్టుబడింది. రూ.11.28 కోట్ల విలువ చేసే 11.28 కేజీల విదేశీ గంజాయి‌ను కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. ఫుడ్ ప్యాకెట్స్ ముసుగులో గంజాయి స్మగ్లింగ్ చేస్తుండగా పట్టుకున్నారు. ఓ లేడి కిలాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. గంజాయిను ఫుడ్ ప్యాకెట్స్‌లో ప్యాకింగ్ చేసి లేడి కిలాడి తరలించే యత్నం చేసింది. కస్టమ్స్ అధికారుల స్క్రీనింగ్‌లో విదేశీ గంజాయి గుట్టు రట్టు అయింది. లగేజ్ బ్యాగ్‌లో దాచిన గంజాయిను స్వాధీనం చేసుకున్నారు. ఎన్‌డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి కస్టమ్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Rana : ఓర్నాయనో.. బయట రూ.10కిలో ఇస్తుంటే రాణా షాపులో పావుకిలో టమాటా రూ.850 అట