Site icon NTV Telugu

POK Protest: పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో భారీ ప్రజా నిరసన.. భారత జెండా ప్రదర్శన..

Pok

Pok

POK Protest: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌(పీఓకే)లో ప్రజలు రోడ్డెక్కుతున్నారు. భారీగా ప్రజలు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. భారీ పన్నులు, అధిక ద్రవ్యోల్భణం, విద్యుత్ కొరకు వ్యతిరేకంగా పీఓకే ప్రజలు పాకిస్తాన్ అధికారులపై దాడులు చేస్తున్నారు. మరోవైపు ఈ నిరసనల్ని అణిచివేసేందుకు పాకిస్తార్ రేంజర్లు, పోలీసులు టియర్ గ్యాస్ ఫైర్ చేయడమే కాకుండా, ఏకే-47తో కాల్పులు జరుపుతున్నట్లు నివేదికలు వెలువడ్డాయి. అనేక మంది ఈరోజు జరిగిన నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

Read Also: Solar Storm: భూమిని తాకిన శక్తివంతమైన “సౌర తుఫాను”.. కమ్యూనికేషన్, పవర్ గ్రిడ్‌లకు అంతరాయం..!

ప్రజలు శాంతియుతంగా నిరసన చేస్తున్న సమయంలో బలగాలు వీరిని అణిచివేసేందుకు ప్రయత్నించడంతో ఒక్కసారిగా ప్రజలు తిరగబడ్డారు. దీంతో ఘర్షణ చెలరేగింది. పోలీసులు, పారామిలిటరీ జరిపని కాల్పుల్లో ఇద్దరు ఆందోళనకారులు మరణించారు. పోలీసులు ఏకే-47లను గాలిలోకి, జనం వైపు కాల్చిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పీఓకేలో ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌ని పాకిస్తాన్‌లోని ఇతర ప్రాంతాలకు, పెద్ద నగరాలకు మళ్లించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ దేశం ఇప్పటికే ఆర్థిక సమస్యలతో నగదు కొరతను ఎదుర్కొంటోంది. ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకుల నుంచి నిధులను కోరుతోంది.

పీఓకేలోని ముజఫరాబాద్, దద్యాల్, మీర్పూర్ ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ముజఫరాబాద్‌లో సెక్షన్ 144 విధించారు. వందలాది మంది ఫ్రాంటియర్ కార్ప్స్ సైనికులు పీఓకేలోకి ప్రవేశించి నిరసనకారులపై హింసాత్మకంగా దాడి చేస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో కొందరు భారతీయ జెండాలను ప్రదర్శించినట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Exit mobile version