Sabarimala: శబరిమలకు అయ్యప్ప భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. వేలాది మంది భక్తులు రావడంతో శబరిగిరులు అయ్యప్ప నామస్మరణతో మారుమ్రోగిపోతున్నాయి. ఇక, అయ్యప్ప స్వామి దర్శనానికి దాదాపు 10 గంటల సమయం పడుతుంది. సన్నిధానం నుంచి పంబ వరకూ అయ్యప్ప భక్తులు క్యూ లైన్ లో వేచి ఉన్నారు. మండల పూజలు ప్రారంభం కావడంతో శబరిమలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుండటంతో అందుకు తగినట్లుగా ఏర్పాట్లను ఆలయ కమిటీ ట్రావెన్ కోర్ చేస్తుంది.
Read Also: RCB Coach: ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు కానీ.. ఆర్‌సీబీకి కోచ్‌గా ఎంపికయ్యాడు!
కాగా, ఇప్పటికే శబరిమలకు వచ్చే అయ్యప్ప భక్తుల దర్శనం కోసం ట్రావెన్ కోర్ దేవస్థానం కమిటీ పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. ముందుగానే ఆన్ లైన్ లో టిక్కెట్లను బుక్ చేసుకోవడం ద్వారా దర్శనం కల్పిస్తుంది. అయినా భక్తుల తాకిడి తగ్గకపోవడంతో దర్శనానికి చాలా సమయం పడుతుందని అధికారులు తెలిపారు. ఈ నెల మొత్తం శబరిమలలో భక్తుల సంఖ్య అధికంగా ఉంటుందనే అంచనాతో అనేక నిర్ణయాలు ట్రావెన్ కోర్ దేవస్థానం తీసుకుంటుంది.