Site icon NTV Telugu

Foreign Currency: ఎయిర్ పోర్ట్ లో పోలీసులకు షాక్.. కాటన్‌ బాక్స్‌ను పరిశీలించగా..

Mumbai Airport

Mumbai Airport

Foreign Currency: గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న హవాలా దందాను టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల బట్టబయలు చేశారు. ముంబై ఎయిర్ పోర్ట్ లో‌ భారీగా విదేశీ కరెన్సీ పట్టుకున్నారు. కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా డాలర్స్ ను హ్యాండ్ బ్యాగ్, కాటన్ బాక్స్ మద్య లో దాచి తరలించే యత్నం చేశాడు కేటుగాడు. కస్టమ్స్ అధికారులు నిర్వహించిన స్కానింగ్ లో బయట పడ్డ డాలర్స్ గుట్టు రట్టైంది. ముంబాయి నుండి దుబాయ్ వెళుతున్న ఓ ప్రయాణీకుడి వద్ద డాలర్స్ ను గుర్తించారు. కోటి రూపాయల విలువ చేసే 90వేల అమెరికన్ డాలర్లను కస్టమ్స్ అధికారులు సీజ్‌ చేశారు. FEMA చట్టం కింద కేసు నమోదు చేసి కస్టమ్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Read also: Amih Shah: నేడే హైదరాబాద్‌ కు కేంద్ర మంత్రి అమిత్‌ షా రాక

సముద్రం గుండా బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్న నిందితులు పోలీసులను చూసి సముద్రంలో బంగారాన్ని విసిరేశారు. అనుమానాస్పదంగా ఉన్న పోలీసులు స్కూబా డైవర్లను మోహరించడంతో సముద్రం అడుగున బంగారం దొరికింది. ఈ ఘటన తమిళనాడులోని రామేశ్వరంలో చోటుచేసుకుంది. వాలైగూడ ప్రాంతంలో గస్తీ నిర్వహిస్తున్న పోలీసులకు సముద్రంలో అనుమానాస్పద బోటు కనిపించింది. పోలీసులు అటువైపు వెళ్లగా.. అందులో ఉన్న ముగ్గురు స్మగ్లర్లు పట్టుబడతామనే భయంతో 12 కిలోల బంగారు బిస్కెట్లను సముద్రంలోకి విసిరారు. పోలీసులు వారిని విచారించి పడవలో వెతికినా ఏమీ దొరకలేదు. అయితే వారి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో సముద్రం అడుగున వెతకడానికి స్కూబా డైవర్లను రప్పించారు. ఈ క్రమంలో మన్నార్‌లోని వలైగూడ ప్రాంతంలో బంగారు బిస్కెట్లు లభ్యమయ్యాయి. పట్టుబడిన బంగారు బిస్కెట్ల విలువ రూ. 8 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు.
Accident at Tummalur Gate: షిఫ్ట్ కారును ఢీ కొట్టిన డీసీఎం.. నలుగురు మృతి

Exit mobile version