NTV Telugu Site icon

Manmohan Singh: 1991 ఆర్థిక సంక్షోభం నుంచి భారతదేశాన్ని మన్మోహన్ సింగ్ ఎలా రక్షించారు..?

How Manmohan Singh

How Manmohan Singh

Manmohan Singh: రెండు సార్లు భారత ప్రధానిగా, సంక్షోభ సమయంలో భారత ఆర్థిక మంత్రిగా పనిచేసిన డాక్టర్ మన్మోహన్ సింగ్(92) గురువారం తుదిశ్వాస విడిచారు. దేశాన్ని అత్యంత ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించారు. ఇప్పుడు మనదేశం 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మారిందంటే అందులో మన్మోహన్ సింగ్ పాత్ర మరవలేదని. దేశాన్ని దివాళా తీసే పరిస్థితి నుంచి తన ఆర్థిక శక్తిగా మార్చిన ఘనత మన్మోహన్ సింగ్‌ కే దక్కుతుంది. పీవీ నరసింహరావు మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా తన సత్తా చాటారు.

దేశ ఆర్థిక వ్యవస్థ రూపశిల్పిగా, దేశాన్ని ఒక చీకటి ఆర్థిక వ్యవస్థ నుంచి బయటపడేశారు. 1991 మధ్య నాటికి భారత దేశ విదేశీ నిల్వలు తక్కువగా ఉన్నాయి. ద్రవ్యోల్భణం రెండంకెలకు చేరింది. భారీ ఆర్థిక లోటు దేశాన్ని కుదేలు చేసే ప్రమాదం ఏర్పడింది. సావరిన్ డిఫాల్ట్‌ని నివారించే కష్టమైన పనిని అప్పటి ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ ఎదుర్కొన్నారు. ప్రధాని పీవీ నరసింహరావు, మన్మోహన్ సింగ్ దశాబ్ధాల నాటి భారత ఆర్థిక వ్యవస్థ సంకెళ్లను తెంచారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థని సరళీకరణ మార్గంలోకి తెచ్చారు.

Read Also: Kamran Ghulam: ఛీ.. ఛీ.. మరి ఇంత దిగజారాలా? బండ బూతులతో రెచ్చిపోయిన పాకిస్థాన్ క్రికెటర్

దేశ ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టేందుకు ధైర్యంగా నిర్ణయాలు తీసుకున్నారు. 1991 జూలైలో రెండుసార్లు రూపాయి విలువను తగ్గించారు. భారతదేశ ఎగుమలను మరింత పోటీతత్వంలోకి వచ్చేలా చేశారు. దీని వల్ల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించేలా చేశారు. ఇదే సమయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంతర్జాతీయ బ్యాంకుకు 47 టన్నుల బంగారాన్ని తాకట్టు పెట్టింది. మారక నిల్వల్ని పెంచుకోవడానికి 600 మిలియన్ డాలర్లను సేకరించారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) నుంచి వచ్చిన అత్యవసర రుణాలు మొత్తం 2 బిలియన్ డాలర్లు దేశాన్ని ప్రమాదం అంచు నుంచి రక్షించాయి.

ఇలాంటి పరిస్థితుల్లో, జూలై 24న మన్మోహన్ సింగ్ తన తొలి బడ్జెట్‌ని సమర్పించారు. దశాబ్దాలుగా పారిశ్రామిక వృద్ధికి అడ్డుకట్ట వేసే బ్యూరోక్రాటిక్ నియంత్రణల వలయం లైసెన్స్ రాజ్‌ను బడ్జెట్ రద్దు చేసింది. ఈ నిర్ణయం భారత ఆర్థిక వ్యవస్థ పరుగెత్తడానికి సహకరించింది. ఇది విదేశీ పెట్టుబడుల పరిమితిని సడలించింది. 51 శాతం వరకు ఈక్విటీ వాటాల కోసం ఆటోమేటిక్ అమోదాలనున అనుమతిస్తుంది. 18 క్లిష్టమైన రంగాలకు మినహా అన్నింటికి పారిశ్రామిక లైసెన్సింగ్‌ని రద్దు చేసింది.

కార్పొరేట్ పన్నుల్ని పెంచారు. వంటగ్యాస్ మరియు చక్కెర వంటి నిత్యావసరాలపై సబ్సిడీలు తగ్గించబడ్డాయి. పెట్రోల్ ధరలు పెరిగాయి. ‘‘ సమయానికి వచ్చిన ఆలోచనను భూమిపై ఏ శక్తి ఆపదు’’అని 1991 బడ్జెట్ సమావేశంలో సింగ్ చెప్పారు. భారతదేశాన్ని కష్టాలను అధిగమించిగల సామర్థ్యంపై తన నమ్మకాన్ని ప్రకటించేలా కామెంట్స్ చేశారు. కొత్త వాణిజ్య విధానం దిగుమతి-ఎగుమతి నిబంధనల్ని సరలించింది. రాజా చెల్లయ్య, M. నరసింహం వంటి ఆర్థికవేత్తల నేతృత్వంలోని కమిటీలు భారతదేశ ఆర్థిక , పన్నుల వ్యవస్థల్లో నిర్మాణాత్మక మార్పులను ప్రవేశపెట్టాయి. ఈ సంస్కరణలు విదేశీ పెట్టుబడుల్ని ఆకర్షించింది. పరిశ్రమని ఆదునీకీకరించాయి. రెండు ఏళ్లలోనే భారత విదేశీ నిల్వలు 1 బిలియన్ డాలర్ల కంటే తక్కువ నుంచి 10 బిలియన్ డాలర్లకు పెరిగింది.

Show comments