Site icon NTV Telugu

Operation Sindoor: పాక్ ప్రయోగించిన “టర్కీ బైరక్తర్ డ్రోన్ వలయాన్ని” భారత్ ఎలా ఛేదించింది..?

Bayraktar Tb2 Drone

Bayraktar Tb2 Drone

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ పంపిన డ్రోన్లను భారత్ అడ్డుకుంది. వందల సంఖ్యలో పాకిస్తాన్ పంపిన డ్రోన్లు మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సమర్థవంతంగా అడ్డుకుంది. టర్కీకి చెందిన అత్యంత ప్రసిద్ధి చెందిన బైరెక్తర్ TB2 డ్రోన్ వలయాన్ని భారత్ విజయవంతంగా ఛేదించింది. ఒక్క డ్రోన్ కూడా తన లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. భారత స్వదేశీ తయారీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ‘‘ఆకాష్ తీర్’’ వ్యవస్థ టర్కిష్ డ్రోన్లను కూల్చేసింది.

Read Also: Ukraine Russia War: ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడిలో, 40 రష్యన్ విమానాలు ఖతం..

ఇంటెలిజెంట్ వార్‌ఫేర్ సామర్థ్యాలు, ఆకాష్‌తీర్ వ్యవస్థ రియల్‌టైమ్, ఆటోమేటెడ్ వాయు రక్షణ యుద్ధంలో భారతదేశ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఆకాష్టీర్ విస్తృత C4ISR (కమాండ్, కంట్రోల్, కమ్యూనికేషన్స్, కంప్యూటర్స్, ఇంటెలిజెన్స్, సర్వైలెన్స్ మరియు రికనైసెన్స్) ఫ్రేమ్‌వర్క్‌లో భాగం. ఇతర వ్యవస్థలతో సమన్వయం చేసుకుంటూ పనిచేస్తుంది. భారత్-పాక్ ఉద్రిక్తతల మధ్య టర్కిష్ డ్రోన్ ముప్పును ఆకాష్‌తీర్ సమర్థవంతంగా ఎదుర్కొన్నట్లు సీనియర్ ఆర్మీ అధికారులు చెబుతున్నారు.

Exit mobile version