Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ పంపిన డ్రోన్లను భారత్ అడ్డుకుంది. వందల సంఖ్యలో పాకిస్తాన్ పంపిన డ్రోన్లు మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సమర్థవంతంగా అడ్డుకుంది. టర్కీకి చెందిన అత్యంత ప్రసిద్ధి చెందిన బైరెక్తర్ TB2 డ్రోన్ వలయాన్ని భారత్ విజయవంతంగా ఛేదించింది. ఒక్క డ్రోన్ కూడా తన లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. భారత స్వదేశీ తయారీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ‘‘ఆకాష్ తీర్’’ వ్యవస్థ టర్కిష్ డ్రోన్లను కూల్చేసింది.