Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత

  • సౌదీ రాజధాని రియాద్ ఎయిర్‌పోర్టుపై హైతీల దాడులు..
  • భారత్ నుంచి విమాన సర్వీసుల నిలిపివేత..
  • ఇండిగో, ఎయిర్ ఇండియా విమాన సర్వీసులు రద్దు..
Saudi Arabia

Saudi Arabia

Saudi Arabia: సౌదీ అరేబియా రాజధాని రియాద్‌ గురువారం వరుస పేలుళ్లతో దద్దరిల్లింది. రియాద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై హౌతీలు దాడులు చేసినట్లుగా తెలుస్తోంది. బాలిస్టిక్ మిసైళ్లతో దాడులు చేసినట్లు హౌతీలు ప్రకటించారు. దీంతో ఎయిర్‌పోర్టును సౌదీ ప్రభుత్వం మూసేసింది. దాడి తర్వాత ప్రయాణికులు ఎయిర్ పోర్టు నుంచి లగేజీ కూడా వదిలేసి పారిపోయినట్లు తెలుస్తోంది.

రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడులతో భారత విమానయాన సంస్థలు అప్రమత్తమయ్యాయి. రియాద్ వెళ్లాల్సిన ఇండిగో, ఎయిర్ ఇండియా విమానాలను దారి మళ్లించడం లేదా రద్దు చేయడం జరిగింది. భద్రతా కారణాలనను చూపుతూ ఈ రెండు విమాన సంస్థలు అక్టోబర్ 10 వరకు తమ రియాద్ విమానాలను రద్దు చేసినట్లు ప్రకటించాయి.

బుధవారం కూడా రియద్, అభా విమానాశ్రయాలపై హైతీలు దాడులు జరిపారు. ఈ దాడుల్లో ముగ్గురు మరణించినట్లు సౌదీ ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు యెమెన్‌లోని హోడెయిడా విమానాశ్రయం సమీపంలో పేలుళ్లు వినిపించాయి . ఈ పేలుళ్లకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. కానీ మక్కా ఒప్పందంలో భాగంగా పాకిస్తాన్ జెట్లు హైతీ తిరుగుబాటుదారులపై దాడులు చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి పాక్ ప్రభుత్వం లేదా సైన్యం ధ్రువీకరించలేదు.