Site icon NTV Telugu

Gujarat: గుజరాత్‌లో కూలిన 3 అంతస్తుల బిల్డింగ్.. శిథిలాలు తొలగింపు

Housecollapsedgujarats

Housecollapsedgujarats

గుజరాత్‌లో గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు నివాసాలు నీళ్లలో మునిగి ఉన్నాయి. ఇక భారీ వర్షాల కారణంగా మంగళవారం గుజరాత్‌లోని ద్వారకలోని ఖంభాలియా తాలూకాలో మూడు అంతస్తుల ఇల్లు కూలిపోయింది. ఇద్దరు ముగ్గురు వ్యక్తులు శిథిలాల కింద చిక్కుకుపోయి ఉంటారని ఎన్‌డిఆర్‌ఎఫ్ ఇన్‌స్పెక్టర్ తెలిపారు. ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందం రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగిస్తున్నారు. సమాచారం అందుకున్న ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందం వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుందని ఇన్‌స్పెక్టర్ తెలిపారు.

ఇది కూడా చదవండి: Prisha Singh : అదే నాకు బాగా ఉపయోగపడింది.. అల్లు శిరీష్ హీరోయిన్ కామెంట్స్

Exit mobile version