NTV Telugu Site icon

Temperature: ఎండలు బాబోయ్ ఎండలు.. 122 ఏళ్ల రికార్డ్​బ్రేక్..

Imd

Imd

ఎండలు దంచికొడుతున్నాయి.. ఏళ్ల క్రితం నమోదైన రికార్డులను భానుడి భగభగలు బ్రేక్‌ చేస్తున్నాయి.. ఏప్రిల్ నెలే.. మే, జూన్ మాసాలుగా మారిపోయి పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి.. మధ్యాహ్నం సమయంలో ఇంటి నుంచి అడుగు బయటకు పెట్టాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి దాపురించింది. ఇప్పటికే చాలా రాష్ట్రాలను అప్రమత్తం చేసింది ఐఎండీ.. ఇక, 122 ఏళ్లలో నార్త్‌ ఇండియాతో పాటు మ‌రి కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితి లేదు.. దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఉత్తర, వాయవ్య, మధ్య భారతంలో రికార్డ్‌స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 122 ఏళ్లలో తొలిసారి గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైన నెలగా ఏప్రిల్‌ నిలిచినట్టు వాతావరణ విభాగం పేర్కొంది.

Read Also: TDP: ఎమ్మెల్యే తలారి సహకారంతోనే హత్య..! ప్రభుత్వ సమాధానం ఏంటి..?

తాజా, పరిస్థితులపై మీడియాతో మాట్లాడిన భార‌త వాతావ‌ర‌ణ శాఖ డైరెక్టర్ జ‌న‌ర‌ల్ మృత్యుంజ‌య మ‌హాపాత్ర.. మే, జూన్ నెలలు కూడా రాకముందే ఎండ‌లు విజృంభిస్తున్నాయ‌ని, మే, జూన్ మాసాల్లాగా ఉష్ణోగ్రత‌లు మారిపోయాయన్నారు.. గుజ‌రాత్‌, రాజ‌స్థాన్‌, పంజాబ్‌, హ‌ర్యానాలో ఎండ‌లు విప‌రీతంగా ఉన్నాయని.. మే నెలలో కూడా ఇలాగే కొన‌సాగుతాయ‌ని పేర్కొన్నారు. మరోవైపు.. ఈ ఏడాది వర్షాలు సాధారణం కంటే ఎక్కువగా నమోదు అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.. వాయువ్య, ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం త‌క్కువ వ‌ర్షపాతం న‌మోద‌య్యే ఛాన్స్ ఉంద‌న్నారు మృత్యుంజ‌య మ‌హాపాత్ర.