NTV Telugu Site icon

Horrific Accident: 70అడుగుల లోతులో పడిన కారు.. పండుగపూట విషాదం

Car Accident In Bengal

Car Accident In Bengal

Horrific Accident: గుజరాత్ లో భాయ్ దూజ్ పండుగరోజు ఓ ప్రమాదం రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. పంచమహల్ జిల్లా మోర్వా హడాఫ్ ప్రాంతంలోని డెలోట్ గ్రామంలో పండుగ జరుపుకునేందుకు ఇద్దరు అన్నాదమ్ములు తన సోదరి ఇంటికి వెళ్లారు. తన మేనమామతో కలిసి గురువారం రాత్రి కారులో తిరిగి వెళ్తుండగా పంచ్ మహల్ హైవేపై.. కారు అదుపు తప్పి 70అడుగుల లోతులో ఉన్న బావిలో పడింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఇద్దరూ నీటిలో మునిగి అక్కడికక్కడే చనిపోయారు.

Read Also: Man Dance with Crocodile : అదేం నీ గర్ల్ ఫ్రెండ్ కాదు.. మొసలితో సాల్సా ఏంటిరా!

మరో ఘటనలో బంగాల్ భారీ ప్రమాదం సంభవించి ఐదుగురు మృతి చెందారు. నదియాలోని నకశిపరా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న 34వ హైవేపై ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు, ఓ మహిళ, ఇద్దరు యువకులు చనిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నకశిపరాలోని నేషనల్ హైవేపై ఓ భారీ లారీ మారుతీ కారు వేగంగా ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. కొందరు పాదాచారులు వారిని కాపాడే ప్రయత్నం చేశారు. రక్తపు మడుగులోఉన్న కారులోని ప్రయాణికులకు అతికష్టం మీద బయటకు లాగారు. వారికి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అప్పటికే వారు చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు.

Read Also: PM Modi: కింద పోలీస్ స్టేషన్.. పైన ఇళ్లు.. మోదీ సార్ ప్లాన్ అదుర్స్

Show comments