Site icon NTV Telugu

LK Advani: ‘‘నాకు మాత్రమే కాదు, నా ఆదర్శాలకు గౌరవం’’.. భారతరత్నపై ఎల్‌కే అద్వానీ..

Lk Adwani

Lk Adwani

LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీకి ఈరోజు భారత ప్రభుత్వం అత్యున్నత అవార్డు భారతరత్నను ప్రదానం చేసింది. దీనిపై ఆయన స్పందిస్తూ.. కృతజ్ఞతలు తెలిపారు. ఇది ఒక వ్యక్తిగా నాకు దక్కిన గౌరవం మాత్రమే కాదని, నా జీవితాంత నా శక్తి మేరకు సేవ చేయడానికి నేను ప్రయత్నించిన ఆదర్శాలు, సూత్రాలకు కూడా గౌరమని అన్నారు. 96 ఏళ్ల అద్వానీ తాను 14 ఏళ్ల వయసులో ఆర్ఎస్ఎస్‌లో చేరి సమయాన్ని గుర్తు చేసుకున్నారు. బీజేపీ సిద్ధాంత గురువు ఆర్ఎస్ఎస్ అప్పగించిన ఏ పనిలోనైనా, నా ప్రియమైన దేశానికి అంకితభావంతో, నిస్వార్థంగా సేవ చేశానన్నారు.

Read Also: Delhi High Court: ఆర్థిక పరిమితికి మించి భార్య కోరికలు కోరడం.. భర్తను మానసిక ఒత్తిడికి గురిచేయడమే..

‘‘ఇదం-నా-మమ’’ అనే నినాదం నా జీవితాన్ని ప్రేరేపించిందని, ఈ జీవితం నాది కాదు, నా జీవితం నా దేశం కోసమే అని ఎల్‌కే అద్వానీ సంస్కృత మంత్రం ద్వారా వెల్లడించారు. తనకు భారతరత్న ప్రదానం చేసినందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీకి అద్వానీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోజు నేను అత్యంత సన్నిహితంగా మెలిగిన ఇద్దరు వ్యక్తులు పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ మరియు భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి కృతజ్ఞతతో గుర్తుంచుకుంటానని అద్వానీ అన్నారు. పార్టీ కార్యకర్తలు, స్వయం సేవకులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని నరేంద్రమోడీ శనివారం ఎల్‌కే అద్వానీకి భారతరత్న అవార్డును ప్రకటించారు. ఇది తన జీవితంలో అత్యంత భావోద్వేగ క్షణం అని పేర్కొన్నారు.

లాల్ కృష్ణ అద్వానీ 2002 నుండి 2004 వరకు భారతదేశానికి 7వ ఉప ప్రధానమంత్రిగా పనిచేశారు. ఆయన బీజేపీ సహ వ్యవస్థాపకులలో ఒకరు , రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) సభ్యుడు. అద్వానీ ఎక్కువ కాలం హోం వ్యవహారాల మంత్రిగా పనిచేసిన వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నారు, లోక్‌సభలో ఎక్కువ కాలం ప్రతిపక్ష నేతగా పనిచేసిన వ్యక్తిగా ఉన్నారు. 2009 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆయన బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి.

Exit mobile version