NTV Telugu Site icon

Honda Cars: పెరుగుతున్న హోండా కార్ల ధరలు.. ఈ ఏడాది రెండో సారి..

Honda

Honda

హోండా సిటీ, హోండా అమేజ్, హోండా డబ్ల్యుఆర్-వీల (ఫ్లాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్ మోడల్స్) ధరలను పెంచామని హోండా కార్స్​ ఇండియా ప్రకటించింది. ఈ ఏడాది ఏప్రిల్ తర్వాత ఇది రెండో సారి పెంచారు. మోడల్​ను బట్టి ధరల పెరుగుదల రూ.11,900 నుండి రూ.20వేల మధ్య ఉంటుంది. హోండా డబ్ల్యూఆర్​వీ ఎస్​యూవీ పెట్రోల్ వేరియంట్ రూ.11,900 పెరిగింది. డీజిల్ వేరియంట్​కు ఇక నుంచి రూ.12,500 ఎక్కువ చెల్లించాలి.

హోండా డబ్ల్యూఆర్​వీ ప్రస్తుత ధర రూ.8.88 లక్షల నుండి రూ.9 లక్షలు (ఎక్స్-షోరూమ్) అయింది. టాప్ వేరియంట్‌‌‌‌‌‌‌‌ ధర రూ.12.24 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. హోండా సిటీ సెడాన్ ఫోర్త్​ జనరేషన్​ మోడల్ మాన్యువల్ వేరియంట్‌‌‌‌‌‌‌‌ ధర రూ.9.30 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి రూ.9.50 లక్షలకు చేరింది. హోండా సిటీ సెడాన్ వేరియంట్ల ధరలు కూడా (పెట్రోల్, డీజిల్) రూ.17,500 వరకు పెరిగాయని కంపెనీ ప్రకటించింది.

హోండా సిటీ సెడాన్ ప్రారంభ ధర ఇప్పుడు రూ.11.46 లక్షలు కాగా, వేరియంట్​ను బట్టి ధరలు రూ.15.47 లక్షల వరకు పెరుగుతాయి. పోయిన సంవత్సరం లాంచ్​ చేసిన హోండా అమేజ్ ఫేస్‌‌‌‌‌‌‌‌లిఫ్ట్ సెడాన్, దాని పెట్రోల్ డీజిల్ వేరియంట్‌‌‌‌‌‌‌‌ ధర రూ.12,500 పెరిగింది. హోండా అమేజ్ తాజా ధర ఇప్పుడు రూ.6.43 లక్షలకు బదులుగా రూ.6.56 లక్షలు అయింది. హోండా జాజ్ ధరలు కూడా రూ.12,500 వరకు పెరిగాయి.

Jubilee Hills Case: కీలకంగా టెక్నికల్ ఎవిడెన్స్.. నేడు కస్టడీ పిటిషన్