జూబ్లీహిల్స్ బాలికపై గ్యాంగ్ రేప్ కేసు లో టెక్నికల్ ఎవిడెన్స్ కీలకంగా మారనుంది. ఇప్పటికే ఇన్నోవా కార్ లో లభించిన ఆధారాలను క్లూస్ టీం సేకరించింది. కార్ లో సరిపడా ఆధారాలు లభించకపోవడంతో టెక్నికల్ ఎవిడెన్స్ పై దృష్టి సారించిన పోలీసులు. నిందితుల కాల్ డేటా రికార్డింగ్స్ , సీసీ ఫుటేజ్ లు, నిందితుల మొబైల్ టవర్ లొకేషన్ లపై పోలీసులు ఫోకస్ పెట్టారు.
అమెనిషియ పబ్ నుండి తిరిగి జూబ్లీహిల్స్ లో బాధితురాలిని డ్రాప్ చేయడం వరకు నిందితుల రూట్ మ్యాప్ లో కీలక ఆధారాలు పోలీసులు సేకరించనున్నారు. మరో వైపు వైరల్ అవుతున్న వీడియోస్ లో ఉన్నది తనా కాదా అనే అంశం పై బాధితురాలి వాంగ్మూలం పోలీసులు తీసుకోనున్నారు. బాధితురాలు పూర్తిగా కోలుకున్న తరువాతే విడియో వెరిఫికేషన్ ద్వారా నిందితులను బాధితురాలు గుర్తు పట్టే అవకాశం వుంది. సీన్ రీ కన్స్ట్రక్షన్ కోసం నిందితులను కస్టడీ కి కోరుతూ నేడు కస్టడీ పిటిషన్ ను పోలీసులు దాఖలు చేయనున్నారు.
జూబ్లీహిల్స్ బాలికపై సామూహిక లైంగికదాడి ఘటనలో మరొకరిని పోలీసులు అరెస్టు చేశారు. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు శనివారం బాధితురాలి వీడియోలు మీడియాకు విడుదల చేయగా, ఆదివారం మరికొన్ని వీడియోలు బయటకు వచ్చాయి. బెంజ్‌కారులో నలుగురు యువకులతో కలిసి బాధితురాలు సన్నిహితంగా ఉన్న ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో బాలిక వీడియోలను వైరల్ చేసిన పాతబస్తీకి చెందిన సుభాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం ఈ కేసులో ఇప్పటివరకు ఐదుగురిని అరెస్టుచేశారు. వారిలో నలుగురు నిందితులు ఉన్నారు.