Site icon NTV Telugu

Home Minister Security Breach: హోం మంత్రి భద్రతా ఉల్లంఘన.. ఆంధ్రా ఎంపీ పీఏ అరెస్ట్

Amit Shah

Amit Shah

Home Minister Security Breach: మహారాష్ట్రలో హోం మంత్రి అమిత్ షా పర్యటన సందర్భంగా ఆయన భద్రతలో లోపం ఏర్పడింది. ఓ వ్యక్తి హోం మంత్రి భద్రతను ఉల్లంఘించాడు. మంగళవారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నివాసానికి వెళ్లారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. అయితే ఆ సమయంలో అనుమానాస్పదంగా వ్యవహరించిన వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. హోంశాఖ అధికారిగా నటిస్తూ.. నిషేధిత ప్రాంతాల్లో తిరుగుతూ అమిత్ షా దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.

ముంబైలోని మలబార్ హిల్స్ లోని సాగర్ బంగ్లాలో దేవేంద్ర ఫడ్నవీస్ నివాసానికి మంగళవారం అమిత్ షా వెళ్లారు. ఈ సమయంలో అమిత్ షా భద్రతనను ఉల్లంఘించి హేమంత్ పవార్ అనే వ్యక్తి అనుమానాస్పదంగా తిరగడాన్ని పోలీసులు గుర్తించారు. అయితే విచారణలో అతను ఆంధ్రప్రదేశ్ ఎంపీకి పర్సన్ అసిస్టెంట్ గా పనిచేసినట్లు తెలిసింది. హోం మంత్రిత్వ శాఖ ఉద్యోగి ఐడీ కార్డు ధరించి గంటల తరబడి హోంశాఖ ఉద్యోగిగా నమ్మించే ప్రయత్నం చేశాడు. ప్రస్తుతం సదరు వ్యక్తిని పోలీసులు విచారిస్తున్నారు.

Read Also: Gender Equality: లింగ సమానత్వం సాధించడానికి మరో 300 ఏళ్లు.. యూఎన్ఓ నివేదిక

32 ఏళ్ల హేమంత్ పవార్ ఫడ్నవీస్ నివాసం దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని గుర్తించిన పోలీసులు..అతని కోసం వేట సాగించారు. తన స్వగ్రామం అయిన ధూలేకి బయలుదేరుతున్న సమయంలో పోలీసులు అతని ఆచూకీ గుర్తించి అరెస్ట్ చేశారు. హేమంత్ పవార్ ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఎంపీకి పర్సనల్ అసిస్టెంట్ గా పనిచేశాడని.. పార్లమెంట్ లో అడుగుపెట్టేందుకు పాస్ కూడా ఉందని పోలీసులు తెలిపారు. అయితే డిప్యూటీ సీఎం ఇంటికి సమీపంలో తచ్చాడుతున్న సమయంలో అతని మెడలో మినిస్ట్రీ ఆఫ్ హోం ఎఫైర్స్ కు సంబంధించిన బ్యాడ్జ్ ఉందని అది నిమైనది కాదని.. హోం మినిస్ట్రీలో ఉద్యోగినని కొందరిని నమ్మించే ప్రయత్నం చేసేందుకు ఇలా చేశారని పోలీసులు తెలిపారు. నిందితుడిని ఐదు రోజులు పాటు పోలీసులు కస్టడీకి తీసుకున్నారు.

Exit mobile version