NTV Telugu Site icon

Sambhal holi celebration: 46 ఏళ్ల తర్వాత సంభాల్‌లో హోలీ వేడుకలు.. భారీగా భద్రత..

Sambhal

Sambhal

Sambhal holi celebration: హోలీ వేడుకల నేపథ్యంలో ఉత్తర్ ప్రదేశ్ సంభాల్ పట్టణం చర్చనీయాంశమైంది. ఇటీవల సంభాల్ పోలీస్ అధికారి చేసిన వ్యాఖ్యలు కూడా వైరల్ అయ్యాయి. ‘‘హోలీ ఏడాదికి ఒకసారి వస్తుంది. శుక్రవారం నమాజ్ 52 సార్లు చేసుకోవచ్చు. ఎవరికైనా హోలీతో ఇబ్బంది ఉంటే ఇంట్లోనే ఉండాలి’’ అని సంభాల్ పోలీస్ అధికారి అనుజ్ చౌదరి అన్నారు. దీనిపై రాజకీయ విమర్శలు వచ్చాయి. సంభాల్‌లోని వివాదాస్పద జామా మసీదుతో పాటు మరో 10 మసీదులను టార్పలిన్లతో కప్పారు.

Read Also: Holi 2025: హోలీ ఆడుతున్నారా? ఈ రంగులతో జాగ్రత్త!

ఇదిలా ఉంటే, 46 ఏళ్ల తర్వాత మొదటిసారిగా సంభాల్ ప్రాంతంలో హోలీ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సంభాల్‌లోని చారిత్మాత్మక కార్తికేయ మహాదేశ్ ఆలయంలో హోలీ వేడుకలు జరిగాయి. హోలీని శాంతియుతంగా జరుపుకోవడానికి భారీగా పోలీస్ బలగాలు మోరించాయి. ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ (VHP) జిల్లా అధ్యక్షుడు ఆనంద్ అగర్వాల్ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. 46 సంవత్సరాల తర్వాత కార్తికేయ మహాదేవ్ ఆలయంలో హోలీ ఆడే భాగ్యం మనకు లభించిందని ఆయన అన్నారు.

గతేడాది నవంబర్‌‌లో జామా మసీదు సర్వేకి వెళ్లిన సమయంలో ముస్లిం మూక పోలీసులు, అధికారులపై దాడులు చేసింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించారు, 30 మంది పోలీసులు గాయపడ్డారు. ప్రాచీన హరిహర్ మందిరాన్ని కూల్చి దానిపై మసీదు నిర్మించారని కోర్టులో పిటిషన్ దాఖలు కావడంతో, దీనిపై కోర్టు సర్వేకి ఆదేశించింది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున హింస చెలరేగింది. అప్పటి నుంచి సంభాల్ దేశవ్యాప్తంగా వార్తల్లో ఉంది. ఈ ఘటన జరిగిన తర్వాత, సంభాల్ వ్యాప్తంగా ఆక్రమణలకు గురైన ఆలయాలు, శివలింగాలు, ప్రాచీన ఆనవాళ్లు ఏఎస్ఐ సర్వేలో వెలుగులోకి వచ్చాయి.