కర్ణాటక రాజ్ భవన్ కు బాంబు బెదిరింపు వచ్చింది. సోమవారం రాత్రి ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఎన్ఐఏ అధికారులకు బాంబు హెచ్చరిక ఫోన్ కాల్ వచ్చింది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. భారీ బందోబస్తుతో రాజ్ భవన్ వద్దకు చేరుకున్నారు. దీంతో రాజ్ భవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రాత్రి 11:30 గంటల సమయంలో ఫోన్ కాల్ రావడంతో అక్కడ తీవ్ర ఆందోళన రేకెత్తించింది. రాజ్ భవన్ ఆవరణపై బాంబు దాడి చేస్తున్నట్టు అజ్ఞాత వ్యక్తి హెచ్చరించాడు. దీంతో పోలీసులు, భద్రతా సిబ్బంది అలర్ట్ అయ్యి బాంబు స్క్వాడ్‌తో అధికారులు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు.
Also Read: Revanth Reddy: ఎంఐఎం ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
బాంబ్ స్క్వాడ్, కే-9 యూనిట్లతో ఘటనా స్థలంలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. అలాగే రాజ్ భవన్ మైదానంలో అధికారులు కూంబింగ్ నిర్వహించారు. ఆ ప్రాంతంలో భద్రత కోసం సమగ్ర తనిఖీని కొనసాగించారు. అయితే బాంబు ఈ ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చిందనే ఇంకా తెలియాల్సి ఉంది. దీనిపై ప్రస్తుతం పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులను టార్గెట్ చేసుకొని దుండగులు ఈ బాంబు బెదిరింపులకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఈ బెదిరింపు కాల్ అధికారులకే రావడంతో వారు బెంగళూరు పోలీసులను అప్రమత్తం చేశారు. దీంతో సెంట్రల్ డివిజన్ పోలీసులు విధానసౌధ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.
Also Read: TS Ministers: కేసీఆర్ను పరామర్శించిన మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ