NTV Telugu Site icon

HMPV Virus: చైనా కొత్త వైరస్‌పై భారత్ అప్రమత్తం.. ఆరోగ్యశాఖ కీలక ఆదేశాలు..

Hmpv Virus

Hmpv Virus

HMPV Virus: చైనాని కొత్త వైరస్ ‘‘హ్యుమన్‌మోటాన్యూమో వైరస్( HMPV వైరస్)’’ విజృంభిస్తోంది. ముఖ్యంగా చైనా ఉత్తర ప్రాంతంలో ఈ వైరస్ తీవ్రత ఎక్కువగా ఉందని అక్కడి అధికారులు వెల్లడించారు. ఇప్పటికే చాలా చోట్ల ఆస్పత్రులకు ప్రజలు క్యూ కడుతున్నారు. జ్వరం, గొంతు నొప్పి, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది, ఛాతి నొప్పులు ఇలా కోవిడ్-19, ఫ్లూ వంటి లక్షణాలు కొత్త వైరస్ వల్ల కలుగుతున్నాయి. ఈ వ్యాధి వ్యాప్తిపై ప్రపంచదేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Read Also: Delhi Assembly Polls: అతిషిపై అల్కా లాంబాను బరిలోకి దింపిన కాంగ్రెస్

ఇదిలా ఉంటే, కొత్త వైరస్‌పై భారత ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఈ వైరస్ వ్యాప్తిపై దృష్టి పెట్టాలని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్(ఎన్సీడీసీ)ని కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. శ్వాసకోశ లక్షణాలు, ఇతర ఫ్లూ కేసులను నిశితంగా పరిశీలించాలని సూచించింది. అంతర్జాతీయ ఏజెన్సీలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు భారత ప్రభుత్వం తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), ఇతర అనుబంధ ఏజెన్సీల నుంచి డిసెంబర్ 16-22 మధ్య వచ్చిన డేటా ప్రకారం చైనాలో సీజనల్ ఇన్‌ఫ్లుఎంజా, రైనోవైరస్, రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్ (RSV) హ్యూమన్ మెటాన్యూమోవైరస్ (HMPV) వంటి తీవ్రమైన శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లు తీవ్రమయ్యాయి.

Show comments