Site icon NTV Telugu

HMPV Virus: దేశంలో మరో HMPV కేసు.. 4 ఏళ్ల బాలుడిలో వైరస్ నిర్ధారణ..

Hmpv

Hmpv

HMPV Virus: చైనాలో ప్రారంభమైన HMPV దేశాన్ని కూడా కలవరపెట్టింది. చైనాలో భారీగా కేసులు నమోదు కావడం, మరోసారి కోవిడ్ మహమ్మారిని గుర్తుకు తెచ్చింది. ఇదిలా ఉంటే, HMPV వైరస్ కేసులు కూడా భారత్‌లో కూడా నమోదు కావడం ఆందోళల్ని పెంచాయి. అయితే, నిపుణులు దీనిని వల్ల పెద్దగా ప్రమాదం ఉండదని చెప్పారు.

Read Also: CM Revanth Reddy : రాష్ట్రంలో విద్యా ప్రమాణాల పెంపుకు పాఠశాల విద్యలో AI ఆధారిత డిజిటల్ విద్య

ఇదిలా ఉంటే, తాజాగా దేశంలో మరో HMPV కేసు నమోదైంది. గుజరాత్ అహ్మదాబాద్‌కి చెందిన 4 ఏళ్ల బాలుడిలో హ్యూమన్ మెటా న్యూమో వైరస్(HMPV) నిర్ధారణ అయినట్లు అధికారులు చెప్పారు. ఈ కేసులో గుజరాత్‌లో మొత్తం కేసుల సంఖ్య 8కి చేరుకుంది. నగరంలోని గోటా ప్రాంతానికి చెందిన బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు, అతని పరిస్థితి నిలకడగా ఉందని అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన వైద్య అధికారి భవిన్ సోలంకి తెలిపారు.

జనవరి 28న జ్వరం, దగ్గు కారణంగా బాలుడిని ఆస్పత్రిలో చేర్పించారు. అదే రోజు నిర్వహించిన పరీక్షల్లో అతడికి వైరస్ సోకినట్లు గుర్తించారు. బాలుడికి ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేదని వైద్యులు చెప్పారు. 2001 లో కనుగొనబడిన HMPV పారామిక్సోవిరిడే కుటుంబానికి చెందినది. ఇది శ్వాసకోశ సిన్సిటియల్ వైరస్ కు దగ్గరి సంబంధం కలిగి ఉంటుంది. ఇది దగ్గు, జ్వరం, ముక్కు దిబ్బడ మరియు శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దగ్గు, తుమ్ముల ద్వారా ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది.

Exit mobile version