Site icon NTV Telugu

Hizbul Mujahideen: హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది అరెస్ట్.. యూపీలో దాడులకు కుట్ర..

Terrorist

Terrorist

Hizbul Mujahideen: రెండు దశాబ్దాలుగా పరారీలో ఉన్న కరడుకట్టిన హిజ్బుల్ ముజాహిదీన్‌తో సంబంధం ఉన్న ఉగ్రవాదిని ఉత్తర్ ప్రదేశ్ ఉగ్రవాది నిరోధక దళం(ఏటీఎస్) అరెస్ట్ చేసింది. ఉల్ఫత్ హుస్సేన్ అలియాస్ మొహమ్మద్ సైఫుల్ ఇస్లాం అలియాస్ అఫ్జల్ హుస్సేన్ మాలిక్‌ని మొరాదాబాద్‌లో అరెస్ట్ చేశారు. యూపీలో పెద్ద ఉగ్రవాద దాడికి కుట్ర పన్నుతున్నట్లు తేలింది.

Read Also: Women’s Day: “మహిళలు ఒక హత్య చేస్తే శిక్షించవద్దు”.. రాష్ట్రపతికి సంచలన లేఖ..

హుస్సేన్ జమ్మూ కాశ్మీర్ పూంచ్ జిల్లాకు చెందిన వ్యక్తి. ఇతడిపై రూ. 25,000 రివార్డ్ ఉంది. 2002 నుంచి ఇతను పరారీలో ఉన్నాడు. హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రసంస్థలో క్రియాశీల సభ్యుడిగా ఉన్నారు. నిందితుడు యూపీకి రాక ముందు పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)లో ఉగ్రవాద శిక్షణ పొందాడు.

హుస్సేన్ ను మొదటిసారి జూలై 9, 2001న అరెస్టు చేశారు. భద్రతా దళాలు అతని నుంచి ఒక AK-47 రైఫిల్, ఒక AK-56 రైఫిల్, రెండు పిస్టల్స్, 12 హ్యాండ్ గ్రెనేడ్లు, 50 డిటోనేటర్లు, 29 కిలోల పేలుడు పదార్థాలు మరియు 507 లైవ్ కార్ట్రిడ్జ్‌లతో సహా భారీ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి. అయితే, బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత, అనేక ఏళ్లుగా పరారీలో ఉన్నాడు. ఉగ్రవాదిపై మొరాదాబాద్ కోర్టు అతడిపై వారెంట్ జారీ చేసింది. యూపీ ఏటీఎస్ అతడిని పట్టుకుని శనివారం అరెస్ట్ చేసింది.

Exit mobile version