NTV Telugu Site icon

Pakistan: పాక్‌లో హిందువులు, సిక్కులు సురక్షితంగా లేరు..ఆ దేశ మంత్రి ఆందోళన..

Pakistan

Pakistan

Pakistan: ఇటీవల పాకిస్తాన్‌లో దైవదూషణ చేస్తున్నాడనే నెపంతో ఓ స్థానిక పర్యాటకుడిని ప్రజలు అత్యంత దారుణంగా కొట్టి, సజీవ దహనం చేశారు. ఈ ఘటన ఆ దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. మతం పేరుతో ఇలా క్రూరంగా ప్రవర్తించడంపై చాలా విమర్శలు వచ్చాయి. బాధితుడు మహ్మద్ ఇజ్మాయిల్ బహిరంగంగా మతోన్మాద గుంపు కాల్చి చంపింది.

తీవ్రవాద భావజాలంపై సొంత దేశ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సోమవారం మాట్లాడుతూ.. దేశంలో హిందువులు, సిక్కులు, క్రైస్తవులు, చిన్న ముస్లిం వర్గాలు, ఇతర మైనారిటీ సమూహాలు మతం పేరుతో టార్గెటెడ్ హింసకు పాల్పడుతున్నారంటూ వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో మతం పేరుతో జరుగుతున్న హింసపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

Read Also: Gupta Nidhulu: గుప్తనిధుల పేరుతో బడా మోసం.. గుట్టురట్టు చేసిన పోలీసులు

రోజూ మైనారిటీలు హత్యకు గురవుతున్నారని, ఇస్లాం ముసుగులో వారికి భద్రత లేదని చెప్పారు. తాను మైనారిటీ భద్రత సమస్యను పరిష్కరించాలనుకుంటున్నానని, కానీ ప్రతిపక్షాలు నా ప్రయత్నాలను అడ్డుకుంటున్నాయని , పాకిస్తాన్ ప్రపంచ అవమానాన్ని ఎదుర్కొంటున్నారని ఆసిఫ్ అన్నారు. రాజ్యాంగ భద్రత ఉన్నప్పటికీ మైనారిటీలకు పాకిస్తాన్‌లో రక్షణ లేకుండా పోయిందని చెప్పారు. పాకిస్తాన్‌లో చిన్న ముస్లిం వర్గాలు కూడా సురక్షితంగా లేవని, ఇది అవమానకరమైన పరిస్థితి అన్నారు. హత్యలకు గురవుతున్నవారు దైవదూషణలకు సంబంధించిన ఆధారాలు లేవని, హత్యలు వ్యక్తిగత పగలతో జరుగుతున్నాయని చెప్పారు.

పాకిస్తాన్‌లో మైనారిటీలైన హిందువులు, సిక్కులు, క్రైస్తవులు బలవంతమైన మతమార్పిడులు, అపహరణలు, హత్యలను ఎదుర్కొంటున్నారని హ్యూమర్ రైట్స్ కమిషన్ ఆఫ్ పాకిస్తాన్(HRCP) నివేదించింది. దీనికి తోడు అహ్మదీయ సమాజంలో హింసాత్మక చర్యలు, తీవ్రమైన వేధింపులకు గురవుతున్నార నివేదికలు చెబుతున్నాయి. క్రైస్తవులు ఉపాధి, విద్యలో వివక్షను ఎదుర్కొంటారు.