RSS chief: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ హిందువులకు కీలక సూచన చేశారు. హిందువులు తమ సొంత భద్రత కోసం భాష, కులం, ప్రాంతం అనే అన్ని విభేధాలను మరించి వివాదాలను నిర్మూలించడం ద్వారా ఐక్యంగా ఉండాలి అని కోరారు. రాజస్థాన్ బరన్‌లో జరిగి ఆర్ఎస్ఎస్ వాలంటీర్లను ఉద్దేశించి భగవంత్ మాట్లాడుతూ.. హిందువులు అన్ని భేదాలను మరించి ఐక్యంగా ఉండాలని సూచించారు.
Read Also: BJP In Jammu Kashmir: కాశ్మీర్‌లో బీజేపీకి ఒక్క సీటు కూడా రాదు..? అసలు తప్పు ఎక్కడ జరిగింది..?
ప్రవర్తనా క్రమశిక్షణ, దేశం పట్ల కర్తవ్యం, లక్ష్యసాధన సమాజంలో అవసరమని ఆయన అన్నారు. ఆర్ఎస్ఎస్ పనితీరు యాంత్రికమైనది కాదని, ఆలోచన ఆధారితమైందని అన్నారు. సమాజం అనేది ‘‘నేను నా కుటుంబం ద్వారా మాత్రమే ఏర్పడలేదు’’ అని అన్నారు. సమాజం పట్ల సర్వతోముఖంగా శ్రద్ధ వహించడం ద్వారా మన జీవితం సార్ధకమవుతుందని చెప్పారు. భారతదేశం హిందూదేశం అని హిందూ అనే పదం దేశంలో నివసించే అన్ని వర్గాల ప్రజలను సూచిస్తుందని అన్నారు.
ఆర్ఎస్ఎస్ అనేది అసమానమైన సంస్థ అని, దీని విలువలు గ్రూప్ లీడర్ నుంచి వాలంటీర్లు, వారి కుటుంబాలకు మాత్రమే కాకుండా పెద్ద మొత్తంలో సమాజానికి అందుతాయని అన్నారు. ఈ కార్యక్రమానికి మొత్తం 3827 మంది ఆర్ఎస్ఎస్ వాలంటీర్లు హజరయ్యారు. ఆర్ఎస్ఎస్ సీనియర్ కార్యకర్తలు రమేష్ అగర్వాల్, జగదీష్ సింగ్ రాణా, రమేష్ చంద్ మెహతా, వైద్య రాధేశ్యామ్ గార్గ్ తదితరులు పాల్గొన్నారు.