NTV Telugu Site icon

California: మరోసారి రెచ్చిపోయిన ఖలిస్తానీలు.. హిందూ ఆలయంపై దాడి..

Usa

Usa

California: ఖలిస్తానీ మద్దతుదారులు మరోసారి రెచ్చిపోయారు. హిందూ ఆలయాలను టార్గెట్ చేస్తూ దాడులకు తెగబడుతున్న వీరు, మరోసారి ఇలాంటి ఘటనకే పాల్పడ్డారు. అమెరికా కాలిఫోర్నియాలోని హిందూ దేవాలయాన్ని గ్రాఫిటీ పెయింట్స్‌తో ధ్ద్వంసం చేశారు. ఇదే ప్రాంతంలో కొన్ని వారాల క్రితం స్వామినారాయణ మందిరంపై కూడా ఇలాగే దాడికి తెగబడ్డారు. తాజాగా మరోసారి హిందూ ఆలయాన్ని టార్గెట్ చేశారు.

Read Also: Japan Earthquake: 92కి చేరిన జపాన్ భూకంప మృతుల సంఖ్య.. ఇంకా 240 మంది మిస్సింగ్..

కాలిఫోర్నియాలోని హేవార్డ్ లోని షెరావలి ఆలయం ఖలిస్తానీ అనుకూల గ్రాఫిటీతో విధ్వంసం సృష్టించారు. ఈ విషయాన్ని హిందూ అమెరికన్ ఫౌండేషన్(హెచ్ఏఎఫ్) సోషల్ మీడియా పోస్టులో వెల్లడించింది. ఈ ఘటనపై పోలీసులతో టచ్‌లో ఉన్నట్లు చెప్పింది, ఆలయాల భద్రత కోసం సెక్యూరిటీ కెమెరాలు, అలారం సిస్టమ్స్ ఏర్పాటు చేయాలని హెచ్ఏఎఫ్ కోరింది.

గతేడాది డిసెంబర్ 23న కాలిఫోర్నియా నెవార్క్ నగరంలోని స్వామినారాయణ మందిర్ వాసనా గోడలపై ఖలిస్తాన్ మద్దతు వ్యాఖ్యలను రాశారు, ప్రధాని మోడీకి వ్యతిరేకంగా పలు కామెంట్స్ చిత్రీకరించారు. ఈ ఘటనపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కూడా స్పందించారు. తీవ్రవాదులు, వేర్పాటువాదులకు చోటివ్వదని అమెరికాకు సూచించారు. ఒక్క అమెరికాలోనే కాదు కెనడా, ఆస్ట్రేలియా, యూకేల్లోని పలు ప్రాంతాల్లో దేవాలయాలపై రాడికల్ ఖలిస్తానీవాదులు దాడులకు తెగబడుతున్నారు.

Show comments