NTV Telugu Site icon

Rajeev Chandrasekhar: కాంగ్రెస్‌కి ‘‘హిండెన్‌బర్గ్’’ సంబంధం.. ఇది సెబీపై దాడి..

Rajeev Chandrasekhar

Rajeev Chandrasekhar

Rajeev Chandrasekhar: సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) చీఫ్‌ను లక్ష్యంగా చేసుకుని అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన తాజా నివేదికను రాజకీయ నాయకులు, ఆర్థిక నిపుణులు తోసిపుచ్చారు. ఇది భారత ఆర్థిక వ్యవస్థను అస్థిరపరిచేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రయత్నం జరుగుతోందని కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఆరోపించారు. ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేవీ సుబ్రమణియన్ సెబీ చీఫ్‌ చిత్తశుద్ధిని సమర్థించారు. ఇది సెబీపై దాడిగా రాజీవ్ చంద్రశేఖర్ అభివర్ణించారు. హిండెన్‌బర్గ్‌తో కాంగ్రెస్‌కి సంబంధాలు ఉన్నాయని సంచలన ఆరోపణలు చేవారు.

‘‘విదేశీ బ్యాంక్ హిండెన్ బర్గ్ ద్వారా సెబీపై జరిగిన ఈ దాడిలో కాంగ్రెస్‌తో స్పష్టమైన భాగస్వామ్యం కలిగి ఉంది. ప్రపంచంలో బలమైన ఆర్థిక వ్యవస్థల్లో ఒకదానిని అస్థిరపరచడం, కించపరచడం, ప్రపంచంలో ఆత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాన్ని గందరగోళ పరచడమే వారి లక్ష్యం’’ అని ఎక్స్ వేదికగా ఆరోపించారు. ఈ నివేదికను ద్వారా సెబీని అప్రతిష్టపాలు చేయడం, మార్కెట్లలో పెట్టుబడిదారులకు నష్టాన్ని, గందరగోళాన్ని కలిగించాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు.

Read Also: BJP: “ఇది మోడీ ఇండియా”.. కాంగ్రెస్ నేతల ‘‘బంగ్లాదేశ్’’ వ్యాఖ్యలపై ఫైర్..

కాంగ్రెస్ రాజవంశం సాయంతో అనేక ప్రపంచ శక్తులు భారతదేశ పురోగతిని నెమ్మదింపచేయాలని లేదా ముందుకు సాగొద్దని కోరుకుంటున్నారని, మేము వారిని సహించమని రాజీవ్ చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నాయకుడు సుధాన్షు త్రివేది కూడా హిండెన్‌బర్ రిపోర్టుని “భారతదేశంలో అసమతుల్యతను సృష్టించే కుట్ర” అని అన్నారు. పార్లమెంట్ సమావేశాల సమయంలోనే ఈ విదేశీ నివేదికలు ఎందుకు వస్తాయని ప్రశ్నించారు. నివేదిక వస్తుందని కాంగ్రెస్ నాయకులకు ముందే తెలుసని ఆరోపించారు.

పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ సర్వీస్ అయిన క్యాపిటల్‌మైండ్ వ్యవస్థాపక-CEO అయిన దీపక్ షెనాయ్, హిండెన్‌బర్గ్ నివేదిక “సెన్సేషనలిజం”లోకి వెళ్లిందని భావించారు. సెబీ ఛైర్‌పర్సన్‌ మాధబి పూరి బచ్‌పై తీవ్ర ఆరోపణలు చేసింది. ఆమెకు అదాగీ గ్రూప్ సంస్థల్లో షేర్ల విలువను కృత్రిమంగా పెంచేందుకు వినియోగించే మారిషన్ ఫండ్‌లో ఆమెకు ఆమె భర్తకు వాటాలు ఉన్నాయిని ఆరోపించింది. ఈమెపై వచ్చిన ఆరోపణల్ని భారతదేశ మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు కేవీ సుబ్రమణియన్ తోసిపుచ్చారు. ప్రస్తుతం ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్న ఆయన మాట్లాడుతూ.. తనకు మాధవి రెండు దశాబ్ధాలుగా తెలుసని ఆమె చిత్తశుద్ధిపై అనవసరమైన ఆరోపలు చేస్తుందని హిండెన్‌బర్గ్‌ని తప్పుపట్టారు.

Show comments