Himanta Sarma Responds To B Ajmal’s hindu Remarks: హిందూ సమాజంపై వివాదాస్పద వ్యాఖ్యల చేసిన అస్సాం పొలిటికల్ లీడర్ బద్రుద్దీన్ అజ్మల్ పై విరుచుకుపడ్డారు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ. పిల్లలు జన్మించడం, పెళ్లిళ్ల గురించి మాట్లాడుతూ.. హిందువులు ముస్లిం ఫార్మలాను అనుసరించాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు అజ్మల్. సోమవారం అజ్మల్ సొంత నియోజకవర్గం అయిన ధుబ్రీకి సమీపంలోని బొంగైగావ్ లో జరిగిన ఓ బహిరంగ సభలో అజ్మల్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు హిమంత బిశ్వ శర్మ.
తల్లి గర్భాన్ని ‘‘ వ్యవసాయ భూమి’’గా చూడవద్దని ఆయన అన్నారు. ఇటీవల ముస్లిం మహిళలు ఎక్కువ మంది పిల్లల్ని కనాలన్న అజ్మల్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. మంచి విద్య అందించేందుకు ముస్లిం కుటుంబాలు ఇద్దరు పిల్లలకు పరిమితం కావాలని కోరారు. ముస్లిం మహిళలను ఓట్ల కోసం వంచించవద్దని శర్మ అన్నారు. ‘‘నాకు మీ ఓట్లు అవసరం లేదు.. కానీ అజ్మల్ మాట వినవద్దు, ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లల్ని కనవద్దు అని అన్నారు. మీరు మీ పిల్లల్ని అగ్రశ్రేణి క్రీడాకారులుగా, డాక్టర్లుగా, ఇంజనీర్లుగా తీర్చి దిద్దవచ్చు’’ అని ముస్లిం మహిళలను ఉద్దేశించి హిమంత బిశ్వ శర్మ వ్యాఖ్యలు చేశారు.
Read Also: Exit Polls: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు బీజేపీవే.. తిరుగులేని కమలం పార్టీ..
సారవంతమైన భూమిలో విత్తనాలు నాటాలని అజ్మల్ అన్నాడు..అయితే మా అమ్మల గర్భాలు పొలాల అని నేను అడుగుతున్నాను..? అని ప్రశ్నించారు. అతని మాటలు వినకూడదు మీరు మీ పిల్లల శ్రేయస్సుపై దృష్టి పెట్టాలని సూచించాడు. మహిళలు ఎంత మందిని కనాలి అని చెప్పే హక్కు అజ్మల్ కు లేదని.. అలా చేస్తే ఆ పిల్లలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. ఆయన ఆ పిల్లలను పెంచేందుకు సిద్ధంగా ఉంటే నేను కూడా ప్రతీ ఒక్కరిని 10-12 మందిని కనాలని అడుగుతానని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లిం మహిళలు తమ పిల్లల్ని జునాబ్‌లు లేదా ఇమామ్‌లు కాదు డాక్టర్లు, ఇంజనీర్లుగా చేయాలని సూచించారు.
గత శుక్రవారం సీఎం హిమంత బిశ్వ శర్మ ‘‘లవ్ జీహాద్’’ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఎంపీ బద్రుద్దీన్ అజ్మల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముస్లిం యువతీయువకుల లాగే.. హిందూ అబ్బాయిలు 20-22 ఏళ్లలో, అమ్మాయిలు 18 ఏళ్లలో పెళ్లిళ్లు చేసుకోవాలని ఆయన అన్నారు. హిందువులు పెళ్లికి ముందు మూడు నాలుగు అక్రమ సంబంధాలు పెట్టుకుంటారని.. 40 ఏళ్ల వయసులో తల్లిదండ్రుల ఒత్తడి మేరకు పెళ్లిళ్లు చేసుకుంటున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా పోలీసులకు ఫిర్యాదులు అందాయి. దీంతో బద్రుద్దీన్ అజ్మల్ క్షమాపణలు చెప్పారు.
