Himachal pradesh Election schedule: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తాజాగా ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించింది. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 12న జరగనున్నాయి. ఒకే దశలో ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరుపుతామని.. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడించారు. డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
Read Also: IT raids: తెలుగు రాష్ట్రాల్లో ఐటీ అధికారుల సోదాలు.. ఒకేసారి 20చోట్ల దాడులు
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అక్టోబర్ 17న నోటిఫికేషన్ జారీ కానుంది. నామినేషన్ కు చివరి తేదీ అక్టోబర్ 27 కాగా.. విత్ డ్రాకు అక్టోబర్ 29 వరకు గడువు ఉంది. నవంబర్ 12న పోలింగ్ నిర్వహించి, డిసెంబర్ 8న ఫలితాలు విడుదల చేయనున్నారు.
మొత్తం హిమాచల్ అసెంబ్లీలో 68 స్థానాలు ఉన్నాయి. 2017 ఎన్నికల్లో బీజేపీ పార్టీ గెలుపొందింది. ప్రస్తుతం బీజేపీకి 45 స్థానాలు ఉండగా.. 20 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొందింది. 2017లో అధికారాన్ని కోల్పోయిన కాంగ్రెస్ హిమాలయ రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోంది. జనవరి 8, 2023తో హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఐదేళ్ల కాలపరిమితి ముగియనుంది.
ఇదిలా ఉంటే ఈ ఏడాది చివర్లో ఎన్నిలకు ఉండబోయే గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావాల్సి ఉంది. అయితే గుజరాత్ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 23న షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది.
ఎలక్షన్ షెడ్యూల్ వివరాలు:
నోటిఫికేషన్ జారీ తేదీ: అక్టోబర్ 17
నామినేషన్ దాఖలుకు చివరి తేదీ: అక్టోబర్ 25
పరిశీలన తేదీ: అక్టోబర్ 27
నామినేషన్ ఉపసంహరణకు చివరి తేదీ: అక్టోబర్ 29
పోలింగ్ తేదీ: నవంబర్ 12
కౌంటింగ్ తేదీ: డిసెంబర్ 8
