NTV Telugu Site icon

Kangana Ranaut: మేకప్ లేకపోతే.. అసలు కంగనా రనౌత్ను ఎవరు గుర్తుపట్టరు: హిమాచల్ప్రదేశ్ మంత్రి

Kangana

Kangana

Kangana Ranaut: హిమాచల్ ప్రదేశ్‌ రాష్ట్రంలోని మండీ బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌పై ఆ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి జగత్‌ సింగ్‌​ నేగి హాట్ కామెంట్స్ చేశారు. అసెంబ్లీలో చర్చ సందర్భంగా జగత్ సింగ్ కంగాన అంశాన్ని ప్రస్తావించారు. ‘జూన్ చివర్లో ముంచెత్తిన వర్షాలు, వరదలతో మన రాష్ట్రం అతలాకుతలమైపోయింది. రాజకీయ నేతలంతా వరద ప్రభావితకాలంలోనే పర్యటించి బాధితులను ఓదార్చారు. ఇక, కంగనా ప్రాతినిధ్యం వహిస్తున్న మండీ నియోజకవర్గం కూడా వరదలో చిక్కుకుపోయిందన్నారు. కానీ, ఆ సమయంలో కంగనా పర్యటించలేదు.. ఇప్పుడు వర్షాలు తగ్గిపోయిన తర్వాత తీరిగ్గా పర్యటిస్తున్నారని విమర్శించారు. వర్షాలు, వరదల సమయంలో ఆమె బయటకు రాదు.. ఎందుకంటే వర్షంలో తడిస్తే ఆమె వేసుకున్న మేకప్ పోతుంది.. కాబట్టి మేకప్ లేకుంటే కంగనను ప్రజలు ఎవరూ గుర్తుపట్టలేరు.. తమ ఎదురుగా ఉన్నది కంగననా? లేక ఆమె తల్లినా? అనేది కూడా ఎవరూ పోల్చుకోలేరు అని మంత్రి జగత్ సింగ్ అన్నారు.

Read Also: Duleep Trophy 2024: ఇండియా-ఎలో 10 మంది టీమిండియా ప్లేయర్స్.. తెలుగోడికి దక్కని చోటు!

కాగా, ఇటీవేల హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రంలో భారీ వరదలు వచ్చాయి. ఈ వర్షాల వల్ల దాదాపు 153 మంది చనిపోగా.. సుమారు రూ.1271 కోట్ల మేర నష్టం జరిగింది. దీంతో, వరద ప్రభావిత ప్రాంతాన్ని ఆగష్టులో బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ సందర్శించి.. బాధితులను పరామర్శించారు. ఆ ఫొటోలను ఎక్స్ వేదికగా కంగనా పోస్ట్ చేసింది. ఆ ఫోటోలపై హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర మంత్రి, కాంగ్రెస్ నేత జగత్‌ సింగ్‌ నేగి ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Show comments