Himachal cabinet expansion sparks dissent in Congress: చాలా రోజుల తర్వాత కాంగ్రెస్ హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. అధికారంలో ఉన్న బీజేపీని ఓడించింది. గెలుపొందిన సంతోషంలో ఉన్న కాంగ్రెస్ లో లుకలుకలు కనిసిస్తున్నాయి. తాజాగా హిమాచల్ ప్రదేశ్ క్యాబినెట్ విస్తరణ పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో అసంతృప్తిని రాజేసింది. కాంగ్రా ఎమ్మెల్యే సుధీర్ శర్మ, ఘరావిన్ ఎమ్మెల్యే రాజేష్ ధర్మాని అధిష్టానంపై బహిరంగంగానే ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు క్యాబినెట్ విస్తరణపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Bomb Threat: మాస్కో-గోవా విమానానికి బాంబు బెదిరింపు..ఎమర్జెన్సీ ల్యాండింగ్
రాజేష్ ధర్మాని పట్ల పార్టీ సవతి తల్లి ప్రేమను చూపిస్తోందని అందుకు నిరసనగా ఘమర్విన్ కాంగ్రెస్ నేత సుభాష్ శర్మ గుండు కొట్టించుకున్నారు. సుఖూజీ ఇప్పుడు ఏమి చేస్తాడో చూద్దాం అంటూ వ్యాఖ్యానించారు. అయితే సీఎం సుఖ్వీందర్ సింగ్ సుకు ఎమ్మెల్యేలు ఇద్దరి పేర్లను హైకమాండ్ కు పంపింపారు. అయితే పార్టీ వీరికి బెర్తులను నిరాకరించినట్లు సమాచారం. వీరిద్దరిని శనివారం హైకమాండ్ పిలిచి నచ్చిన శాఖల పేర్లను చెప్పాలని కోరినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మాజీ సీఎం వీరభద్ర సింగ్ కు విధేయుడిగా ఉన్న సుధీర్ శర్మ 2012లో కాంగ్రెస్ ప్రభుత్వంలో క్యాబినెట్ పొందారు.
అయితే సుధీర శర్మకు అంతకుముందు పార్టీ టికెట్టు ను అతని ప్రత్యర్థి వర్గాలు వ్యతిరేకించాయి. ఇప్పుడు క్యాబినెట్ బెర్తు ఇవ్వడానికి వ్యతిరేకిస్తున్నారని తెలిసింది. కాగా, గత ఎన్నికల్లో సోనియా గాంధీ టికెట్ ఇవ్వడంతో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. గతంలో కాంగ్రా లోక్‌సభ ఎన్నికల్లోనూ, ధర్మశాల ఉపఎన్నికలోనూ పోటీ చేయడానికి నిరాకరించినందుకు సుధీర్ పార్టీ హైకమాండ్ ఆగ్రహానికి గురయ్యారు. రాజేష్ ధర్మాని సుఖ్‌విందర్ సింగ్ సుఖుకు సన్నిహితుడు కానీ ఆయనకు కూడా క్యాబినెట్ బెర్తను తిరస్కరించారు. 2024 ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి బీజేపీకి సహకరించే అవకాశం ఉంది.
