Karnataka High Court Going Verdict Tomorrow on Hijab Row Issue.
దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించిన హిజాబ్ వివాదంపై క్లారిటీ రానుంది. తరగతులకు హిజాబ్‌తో రావద్దంటూ ఓ విద్యా సంస్థ ఇచ్చిన ఆదేశంతో రేగిన ఈ వివాదం కర్ణాటకను అల్లకల్లోలానికి గురి చేసింది. కేవలం ఒకే ఒక్క విద్యా సంస్థ జారీ చేసిన ఈ ఉత్తర్వులు దేశవ్యాప్తంగా మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రమాదముందంటూ జనం భయాందోళనలకు గురయ్యారు. దీంతో దీనిపై కర్ణాటక హైకోర్టు విచారణ చేపట్టింది.
ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ దాఖలైనా.. ప్రస్తుతం ఈ వివాదంపై కర్ణాటక హైకోర్టు విచారణ సాగిస్తున్నందున అక్కడకే వెళ్లాలని, హైకోర్టు ఇచ్చే తీర్పుపై అభ్యంతరం ఉంటే అప్పుడు తమను ఆశ్రయించాలని సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది. అంతేకాకుండా ఈ వ్యవహారంపై త్వరితగతిన విచారణ పూర్తి చేయాలని కూడా సుప్రీంకోర్టు కర్ణాటక హైకోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో కర్ణాటక హైకోర్టు ఈ వ్యవహారంపై ఇరు వర్గాల వాదనలను యుద్ధ ప్రాతిపదికన వినింది. విచారణ ముగిసిందని ప్రకటించిన కోర్టు.. తన తీర్పును మంగళవారం ప్రకటించనున్నట్లుగా వెల్లడించింది. దీంతో రేపు హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందోనన్న ఆసక్తి నెలకొంది.
