Site icon NTV Telugu

Maharashtra: కారు ఆపమన్నందుకు..ఏకంగా ట్రాఫిక్ పోలీస్‌ని 10 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లాడు..

Maharashtra

Maharashtra

Maharashtra: మహారాష్ట్రలో దారుణం జరిగింది. కారు అపమన్నందుకు, ఏకంగా ట్రాఫిక్ పోలీసును దాదాపుగా కారుపై 10 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. డ్రగ్స్ మత్తులో ఉన్న ఓ వ్యక్తి తన కారు విండ్ షీల్డ్ పై ట్రాఫిక్ కానిస్టేబుల్ ను 10 కిలోమీటర్లు తీసుకెళ్లాడు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ఈ ఘటన జరిగింది.

Read Also: Dogs Attack: కుక్కల దాడిలో వ్యక్తి మృతి.. వార్నింగ్ వాక్ వెళ్లిన సమయంలో..

ఏదో తప్పు జరుగుతుందని గమనించిని ట్రాఫిక్ పోలీస్ కారును ఆపేందుకు ప్రయత్నించాడు. దీన్ని పట్టించుకోని కారు డ్రైవర్ వేగంగా నడిపాడు. అయితే బైక్ పై కారును వెంబడించిన సిద్దేశ్వర్ మాలీ, వాషి నగరంలోని ఓ క్రాస్ రోడ్డులో ఆపేందుకు ప్రయత్నించాడు. అయితే డ్రైవర్ వేగం తగ్గించకపోగా.. కానిస్టేబుల్ ఢీకొట్టే ప్రయత్నం చేయడంతో తప్పించుకున్న కానిస్టేబుల్ కార్ విండ్ షీల్డ్ ను పట్టుకుని వేలాడుతూ కనిపించాడు. నిందితుడు ఆదిత్య బెంబాడే దాదాపుగా ఇలాగే 10 కిలోమీటర్లు కారును నడిపాడు. చివరగా నగరంలోని ఉరాన్ నాకా వద్ద గవాన్ ఫాటా సమీపంలో పోలీస్ వాహనంతో వేగం వెళ్తున్న కారును వెంబడించి ఆపారు. ఆ వ్యక్తిని ఇప్పుడు అరెస్టు చేశారు మరియు డ్రగ్స్ మత్తులో మాలిని చంపడానికి ప్రయత్నించినందుకు అతనిపై కేసు నమోదు చేయబడింది.

Exit mobile version