NTV Telugu Site icon

Chef Kunal Kapur: సెలబ్రిటీ చెఫ్ కునాల్ కపూర్‌కి భార్య క్రూరత్వం కారణంగా విడాకులు..

Kunal Kapoor

Kunal Kapoor

Chef Kunal Kapur: సెలబ్రిటీ చెఫ్, టెలివిజన్ షో ‘‘మాస్టర్ చెఫ్’’ న్యాయనిర్ణేతగా ఉన్న కునాల్ కపూర్‌కి భార్య నుంచి ఢిల్లీ హైకోర్టు విడాకులు మంజూరు చేసింది. విడిపోయిన భార్య తన పట్ల క్రూరత్వం ప్రదర్శిస్తుందనే కారణంతో అతనికి కోర్టు మంగళవారం విడాకులు ఇచ్చింది. అంతకుముందు విడాకులు ఇచ్చేందుకు నిరాకరించిన కుటుంబ న్యాయస్థానం తీర్పును ఛాలెంజ్ చేస్తూ ఆయన ఢిల్లీ హైకోర్టుకు అప్పీల్ చేసుకున్నాడు. భర్తపై నిర్లక్షపూరితంగా, పరువుకు నష్టం కలిగించే, అవమానకరమైన, నిరాధారమైన ఆరోపణలు చేయడం క్రూరత్వానికి సమానమని కోర్టు పేర్కొంది.

ప్రస్తుత కేసులో వాస్తవాలను పరిశీలిస్తే భర్త పట్ల భార్య ప్రవర్తన అగౌరపరిచేలా ఉందని, సానుభూతి లేని విధంగా ఉందని కోర్టు పేర్కొంది. జీవిత భాగస్వామి మరొకరి పట్ల అలాంటి స్వభావం కలిగి ఉన్నప్పుడు, అతి వివాహానికే అవమాన్ని కలిగిస్తుంది. బాధల్ని భరిస్తూ భార్యతో కలిసి ఉండేందుకు అతని ఒక్క కారణం కూడా లేదని జస్టిస్ సురేష్ కుమార్ కైత్, నీనా బన్సల్‌ కృష్ణతో కూడిన న్యాయమూర్తుల బెంచ్ పేర్కొంది.

Read Also: Istanbul: టర్కీలో భారీ అగ్ని ప్రమాదం..29 మంది దుర్మరణం..

చెఫ్ కునాల్ కపూర్‌కి ఏప్రిల్ 2008లో వివాహమైంది. వారికి 2012లో కుమారుడు జన్మించాడు. తన భార్య తన తల్లిదండ్రులతో ఎప్పుడూ కూడా గౌరవంగా నడుచుకోలేదని, తనను అవమానించేదని ఆయన ఆరోపించారు. మరోవైపు ఆయన కోర్టును తప్పుదోవ పట్టించేందుకు అతను తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని భార్య తెలిపింది. భర్తతో ప్రేమతో, విధేయతతో ఉన్నానని చెప్పింది. అయితే, తన నుంచి విడిపోయేందుకు కునాల్ కట్టుకథ అల్లాడని ఆయన భార్య ఆరోపించింది.

ప్రతీ వివాహంలో విబేధాలు అనివార్యమైన భాగమే అని, అలాంటి గొడవలు జీవిత భాగస్వామి పట్ట అగౌరవం, నిర్లక్ష్యంగా మారినప్పుడు వివాహం తన పవిత్రతతను కోల్పోతుందని కోర్టు పేర్కొంది. పెళ్లైన రెండు ఏళ్లలోనే ఆయన సెలబ్రిటీ చెఫ్‌గా మారారని, అది అతని కృషి, సంకల్పానికి ప్రతిబింబమని కోర్టు పేర్కొంది. భార్య క్రూరత్వంగా నడుచుకుందని కోర్టు తీర్పు చెప్పింది.