జమ్మూలో హై అలర్ట్ …
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత భూభాగంలోకి డ్రోన్లు చొచ్చుకు రావడం… దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. జమ్మూలోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లోకి డ్రోన్లను పంపి… ఐఈడీలను జారవిడిచారు. అర్ధరాత్రి తర్వాత రెండు డ్రోన్లు రావడంతో… జవాన్లు వీటిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు వాయుసేన సిబ్బందికి గాయాలయ్యాయి.. వాయుసేన స్థావరంపై దాడి జరిగిన 24 గంటల్లోనే మరో సైనిక స్థావరం వద్ద డ్రోన్ల సంచరించడం ఆందోళనకు గురి చేస్తోంది. డ్రోన్ల దాడి తర్వాత… జమ్ములో హై అలర్ట్ ప్రకటించారు. పోలీసులు, జవాన్లు… ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. జమ్ములోని వాయుసేన స్థావరంపై జరిగిన డ్రోన్ దాడి వివరాలు… ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పేలుళ్లకు ముందు రెండు డ్రోన్లు ప్రయాణించిన చప్పుడు వచ్చినట్లు గుర్తించారు. ఒక్కో డ్రోన్ 2 కిలోల చొప్పున అత్యంత శక్తిమంతమైన ఐఈడీలను మోసుకొచ్చినట్లు సైన్యం వెల్లడించింది. దాడి తర్వాత అవి సురక్షితంగా వెళ్లిపోయినట్లు భావిస్తున్నారు. దాదాపు 100 మీటర్ల ఎత్తు నుంచి వినియోగించి ఉండొచ్చని ఎన్ఐఏ, ఎన్ఎస్జీ అనుమానం వ్యక్తం చేస్తున్నాయి..
వీటిని పాకిస్థాన్ నుంచి లేదా స్థానిక ఉగ్రవాదుల సాయంతో భారత్ నుంచే ఆపరేట్ చేసి ఉండొచ్చని భావిస్తున్నారు. చీకటి ఉన్న కారణంగానే… లక్ష్యంగా సరిగా గుర్తించలేకపోయాయని… ప్రమాదం తీవ్రత కూడా తగ్గిందని చెబుతున్నారు. జమ్మూ కశ్మీర్లోకి డ్రోన్లు ప్రవేశించడంపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఫైరయ్యారు. అత్యంత పకడ్బందీగా సెక్యూరిటీ ఉన్నా… భారత భూభాగంలోకి డ్రోన్లు ఎలా వచ్చాయన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఏం చేస్తున్నారని అన్నారు. వాయుసేనపై దాడికి యత్నించిన డ్రోన్లు… అమెరికావో లేదంటే చైనా దేశానికి చెందినవో వెంటనే గుర్తించాలన్నారు. మరోసారి శత్రుదేశాలు డ్రోన్ల దాడికి పాల్పడకుండా… చర్యలు తీసుకోవాలని ప్రధాని మోడీ ఆదేశాలు జారీ చేశారు.
Also Read
- Supreme Court: ట్రాఫిక్ చలాన్లు ఎగ్గొడుతున్నారా? అయితే కరెంట్ బిల్‌తో కలిపేయండి! సుప్రీంకోర్టు ఊహించని సలహా..
- NEET UG 2027: గుడ్ న్యూసా? బ్యాడ్ న్యూసా?.. నీట్ 2027 ప్యాటర్న్ పూర్తిగా మారబోతోందా?
- Supreme Court: యూపీఐ ఛార్జీలపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం..
- Tax Raids: రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఐటీ సోదాలు.. హీరోయిన్‌పై సంచలన ఆరోపణలు..
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!