Hemant Soren: భూ కుంభకోణం కేసులో జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సొరెన్‌ని శుక్రవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) 5 రోజుల కస్టడీకి తీసుకుంది. ఈ కేసులో కేసులో హేమంత్ సోరెన్‌ను ఏడు గంటలకు పైగా విచారించిన తర్వాత బుధవారం ఈడీ అరెస్ట్ చేసింది. అయితే, దీనిపై ఆయన ఏక కాలంలో జార్ఖండ్ హైకోర్టు, సుప్రీంకోర్టులను ఆశ్రయించారు.
Read Also: Gyanvapi Case: జ్ఞానవాపి కేసులో ముస్లిం పక్షానికి ఎదురుదెబ్బ.. పూజల కొనసాగింపుకే హైకోర్టు మొగ్గు..
ఈ కేసులో ఈడీ తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ హేమంత్ సోరెన్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించడానికి అంతకుముందు రోజు సుప్రీంకోర్టు నిరాకరించింది. జార్ఖండ్ హైకోర్టుని ఆశ్రయించాల్సిందిగా సూచించింది. జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించాల్సిందిగా 48 ఏళ్ల జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) చీఫ్ హేమంత్ సొరెన్‌ని న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, ఎంఎం సుందరేష్, బేల ఎం త్రివేదిలతో కూడిన ప్రత్యేక ధర్మాసనం కోరింది. దర్యాప్తు సంస్థ జారీ చేసిన సమన్లను రద్దు చేయాలని, అరెస్టును చట్టవిరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ హేమంత్ సోరెన్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన పక్షంలో అత్యున్నత న్యాయస్థానం ఈ విధంగా స్పందించింది.
ఈడీ అరెస్ట్ చేయడం కన్నా ముందే ఆయన తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం జార్ఖండ్ రాష్ట్రంలో జేఎంఎం, కాంగ్రెస్ కూటమి అధికారంలో ఉంది. మరోవైపు ఈ రోజు హేమంత్ సొరెన్ నమ్మకస్తుడు చంపై సోరెన్ కొత్త ముఖ్యమంత్రగి ప్రమాణస్వీకారం చేశారు.
