Site icon NTV Telugu

Mumbai: ముంబైను ముంచెత్తిన భారీ వర్షాలు.. నిలిచిన ప్రజా రవాణా

Mumbairain

Mumbairain

ఆర్థిక రాజధాని ముంబైను భారీ వర్షాలు ముంచెత్తాయి. నవీ ముంబై, థానేలో ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు నగరం అతలాకుతలం అయింది. రహదారులు జలమయం అయ్యాయి. ఉదయాన్నే డ్యూటీలకు వెళ్లే వారంతా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇక రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఇదిలా ఉంటే అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండాలని అధికారులు ప్రజలను కోరారు.

ఇది కూడా చదవండి: Kerala: కేరళలో షాకింగ్ ఘటన.. హత్యాచార ఖైదీ జైలు గోడ దూకి పరారీ

మహారాష్ట్రలో కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా.. ఇంకొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఇక నగరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
జూలై 25, 26 తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆదివారం మాత్రం పరిస్థితి మెరుగ్గా ఉంటుందని చెప్పింది. మోస్తరు వర్షాలు మాత్రమే ఉంటాయని వెల్లడించింది. ఇక ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నందున ముంబై, సమీప జిల్లాల్లోని నివాసితులు ఇళ్లలోనే ఉండాలని, తీరప్రాంతాలకు దూరంగా ఉండాలని ముంబై పోలీసులు శుక్రవారం సూచించారు.

ఇది కూడా చదవండి: Emmanuel Macron: పాలస్తీనా ఏర్పాటుకు ఫ్రాన్స్ అధ్యక్షుడు మద్దతు.. మండిపడ్డ ట్రంప్, నెతన్యాహు

ఇక భారీ వర్షాలు కారణంగా ముంబై లోకల్ ట్రైన్ సర్వీసులు నిలిచిపోయాయి. కొన్ని సర్వీసులు నిలిపోగా.. ఇంకొన్ని సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరికొన్ని రైళ్లను దారి మళ్లిస్తున్నారు. ఇక రహదారులపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Exit mobile version