Site icon NTV Telugu

Bengaluru: బెంగళూరును ముంచెత్తిన కుండపోత వర్షం.. కొట్టుకుపోయిన కార్లు, బైకులు

Bengalururain2

Bengalururain2

బెంగళూరులో అర్ధరాత్రి కురిసిన వర్షానికి నగరం అతలాకుతలం అయింది. ప్రధాన రోడ్లన్నీ జలమయం అయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొన్ని కార్లు, బైకులు ప్రవాహానికి కొట్టుకుపోయాయి. అయితే రోడ్లు జలమయం కావడానికి ప్రజలే కారణమంటూ కర్ణాటక మంత్రి జి.పరమేశ్వర ఆరోపించారు. ప్రజలు కాగితాలు, బాటిళ్లు కాలువల్లో వేయడం వల్ల డ్రైనేజీలు మూసుకుపోతున్నాయని.. దీంతో నీళ్లు వెళ్లే దారి లేక రోడ్లుపై నిలిచిపోతున్నాయని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Moeen Ali: ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో నా పేరెంట్స్‌ పీవోకేలోనే ఉన్నారు.. హడలిపోయానన్న స్టార్‌ క్రికెటర్..!

సోమవారం ఉదయం 8:30 గంటల నాటికి గత 24 గంటల్లో బెంగళూరు నగరంలో సగటున 105.5 మి.మీ వర్షపాతం నమోదైందని స్థానిక వాతావరణ కేంద్రం తెలిపింది. ఇటీవలి చరిత్రలో మే నెలలో నమోదైన అత్యధిక వర్షపాతం ఇదేనని వాతావరణ శాస్త్రవేత్తలు గుర్తించారు. కర్ణాటక రాష్ట్ర విపత్తు పర్యవేక్షణ విభాగం ప్రకారం.. కెంగేరిలో అత్యధికంగా 132 మి.మీ వర్షపాతం నమోదైంది. బెంగళూరు ఉత్తర ప్రాంతంలోని వడేరహళ్లిలో 131.5 మి.మీ వర్షపాతం.. అనేక ప్రాంతాలలో రాత్రిపూట 100 మి.మీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది.

ఇది కూడా చదవండి: Bharat : నటుడు మాస్టర్ భరత్ తల్లి కన్నుమూత..

ఇక శుక్రవారం వరకు బెంగళూరుకు కేంద్ర వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాన్ కారణంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. దక్షిణాది రాష్ట్రాలతో పాటు అనేక రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది.

రాత్రి కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ప్రసిద్ధ సిల్క్ బోర్డ్ జంక్షన్, బొమ్మనహళ్లి, హెచ్‌ఆర్‌బీఆర్ లేఅవుట్ దగ్గర వరదలు సంభవించాయి. న్యూ బెల్ రోడ్‌లో అయ్యప్ప దేవాలయం వైపు, నాగవార బస్‌స్టాప్ నుంచి సారయపాళ్యం వైపు, అల్లసంద్ర నుంచి యలహంక సర్కిల్ వరకు నీటి ప్రవాహం గురించి బెంగళూరు పోలీసులు హెచ్చరిక జారీ చేశారు.

 

Exit mobile version