Site icon NTV Telugu

మరోసారి చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారం పట్టివేత…

మరోసారి చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లో భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణీకుల వద్ద 1.13 కోట్ల విలువ చేసే 1.42 కేజీల బంగారం తో పాటు ఎలక్ట్రానిక్ వస్తువులను కస్టమ్స్‌ అధికారు సీజ్ చేశారు. కస్టమ్స్ అధికారులను బురడి కొట్టించడానికి బంగారాన్ని కార్టన్ బాక్స్ మధ్య భాగంలో దాచి కేటుగాళ్లు తరలించేందుకు యత్నించారు.

అయితే 5 మంది ప్రయాణీకుల కదలికలపై అనుమానంతో కస్టమ్స్‌ బృందం వారిని అదుపులోకి తీసుకున్నారు. కస్టమ్స్‌ అధికారులు తమదైన స్టైల్ లో విచారణ చేయగా బంగారం గుట్టు బయటపడింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న కస్టమ్స్‌ అధికారులు 5మంది ప్రయాణికులకు అరెస్ట్‌ చేసి బంగారాన్ని సీజ్‌ చేశారు.

Exit mobile version