Site icon NTV Telugu

PM Modi: మోడీ హెలికాప్టర్‌కు ప్రతికూల వాతావరణం.. దారి మళ్లింపు

Pm Modi

Pm Modi

ప్రధాని మోడీ పశ్చిమ బెంగాల్ పర్యటనలో ప్రతికూల వాతావరణం ఇబ్బందికి గురి చేసింది. గత కొద్దిరోజులుగా పొగ మంచు కారణంగా ఆయా రాష్ట్రాలు కొట్టిమిట్టాడుతున్నాయి. అయితే శనివారం ప్రధాని మోడీ పశ్చిమ బెంగాల్ పర్యటనకు వెళ్లారు. అయితే ప్రధాని ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌కు ప్రతికూల వాతావరణం ఇబ్బంది పెట్టింది. దీంతో హెలికాప్టర్ తహెర్‌పూర్‌లో నియమించబడిన హెలిప్యాడ్‌లో కాకుండా కోల్‌కతా ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయింది. అయితే అనుకూల పరిస్థితులు వచ్చేంత వరకు విమానాశ్రయంలోనే ప్రధాని ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే తిరిగి వెళ్లారా? లేదా? అనేది క్లారిటీ రాలేదు.

ఉదయం 10.40 గంటలకు కోల్‌కతా చేరుకున్న ప్రధాని మోడీ హెలికాప్టర్‌లో నాడియా జిల్లాలోని తాహెర్‌పూర్‌కు బయల్దేరారు. హైవే ప్రాజెక్టులను ప్రారంభించాల్సి ఉంది. బీజేపీ పరివర్తన్ సంకల్ప సభలో కూడా పాల్గొని ప్రసంగించాల్సి ఉంది. అయితే ప్రతికూల వాతావరణం ఉండడంతో హెలికాప్టర్ తిరిగి కోల్‌కతాలో ల్యాండ్ అయిపోయింది.

ఇటీవలే ఎన్నికల సంఘం ప్రత్యేక ఓటర్ సర్వే చేపట్టింది. దాదాపు 58 లక్షల ఓట్లను ఈసీ తొలగించింది. వచ్చే ఏడాది ప్రారంభంలోనే పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల జరగనున్నాయి. ఈసీ తొలి ఓటర్ ముసాయిదా ప్రకటించిన తర్వాత ప్రధాని మోడీ బెంగాల్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. గత ఐదు నెలల్లో ఇది మూడో పర్యటన.

Exit mobile version