Site icon NTV Telugu

Tamil Nadu: తమిళనాడులో అగ్ని ప్రమాదం.. టాటా ఎలక్ట్రానిక్స్లో భారీ పేలుడు..

Tamil Nadu

Tamil Nadu

Tamil Nadu: తమిళనాడు రాష్ట్రంలోని కృష్ణగిరి జిల్లా పరిధిలో ఈ రోజు (శనివారం) ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని హోసూరులో ఉన్న టాటా ఎలక్ట్రానిక్స్ కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆకస్మాత్తుగా మంటలు రావడంతో కంపెనీ బయటకు పలువురు ఉద్యోగులు పరుగులు తీశారు. తెల్లవారుజామున కంపెనీలో సిబ్బంది తక్కువగా ఉండటంతో వారందరూ బయటకు పారిపోవడంతో కంపెనీ మొత్తానికి మంటలు వ్యాపించాయి.

Read Also: Inter Admissions: ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్ల గడువు మరోసారి పొడిగింపు.. ఎప్పటి వరకు అంటే..

అయితే, కంపెనీలోని సిబ్బంది సమాచారం మేరకు సంఘటన ప్రదేశానికి చేరుకున్న ఆగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్లతో మంటలార్పేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో వాటిని ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించారు. ఈ మంటలను అదుపు చేసేందుకు దాదాపు రెండు గంటల పాటు ఫైర్ సిబ్బంది కష్టపడ్డారు. ఈ ప్రమాదంలో కోట్ల రూపాయల్లో ఆస్తి నష్టం జరిగినట్లుగా కంపెనీ యాజమాన్యం వెల్లడించింది. ఇక, టాటా ఎలక్ట్రానిక్స్లో ప్రమాదం గురించి తెలిసిన పోలీసులు ప్రమాదంపై ఆరా తీస్తున్నారు. ఇప్పటికే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకోని విచారణ చేస్తున్నారు.

Exit mobile version