Delhi Airport: అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా దేశంలోకి ఏదో విధంగా డ్రగ్స్ వస్తూనే ఉన్నాయి. దేశంలోని పలు విమానాశ్రయాల్లో డ్రగ్స్ తరలిస్తూ పట్టుబడుతున్నారు స్మగ్లర్లు. విదేశాల నుంచి అక్రమంగా ఇండియాలోకి డ్రగ్స్ ను తీసుకువస్తున్నారు. ఒక షూష్ లో డ్రగ్స్ ధరిస్తే.. మరొకరు తమ తెలివిని ఉపయోగించి డ్రగ్స్ ను తరలించేందుకు పలు ఐడియాలను ఉపయోగిస్తున్నారు. ఓ ప్రయాణికులు తన కడుపులో డ్రగ్స్ ను క్యాప్సూల్స్ రూపంలో తరలించేందుకు ప్రయత్నం చేశాడు. ఏకంగా దానికి తన కడుపులోనే పెట్టుకుని తరలించేయత్నంలో కష్టమ్స్ అధికారులకు పట్టుబడ్డాడు.
Read also: Ram Charan: RC16 లీకేజ్ ఇచ్చేసిన రామ్ చరణ్.. రంగస్థలంకి మించి..
తాజాగా ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం లో భారీ గా డ్రగ్స్ పట్టుబడింది. రూ.11.28 కోట్ల విలువ చేసే 753 గ్రాముల కొకైన్ ను కస్టమ్స్ అధికారలు సీజ్ చేశారు. బ్రెజిల్ జాతీయుడి పై అనుమానం వచ్చి అతని వద్ద డ్రగ్స్ కస్టమ్స్ అధికారులు గుర్తించారు. కొకైన్ ను క్యాప్సూల్స్ లో నింపి పొట్టలో దాచి తరలించే యత్నం చేశాడు కేటుగాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 85 క్యాప్సూల్స్ మింగి దాని ఎటువంటి అనుమానం రాకుండా తరలించేందుకు ప్రయత్నించాడు. అతనిపై అనుమానం కలగడంతో అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ బృందం అతనిని పరిశీలించగా నిర్ఘాంత పోయే విషయం వెలుగులోకి వచ్చింది. అతని పొట్టలో దాచిన డ్రగ్స్ గుట్టు రట్టు రట్టైంది. షాక్ తిన్న అధికారులు అతన్ని శస్త్రచికిత్సకు తీసుకుని వెళ్లారు. అయితే తన పొట్టలో ఏకంగా 85 డ్రగ్స్ క్యాప్సూల్స్ ను గుర్తించి.. వాటిని వైద్యులు బయటకు తీశారు. నిందితుడిపై NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి కస్టమ్స్ అధికారులు దర్యాప్తు చేస్తుననారు. వీరి వెనుక ఎవరు ఉన్నారనే దానిపై ఆరా తీస్తున్నారు. ఇది మొదటి సారా? లేక ఇంతకుముందు కూడా తరలించారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. బ్రిజిల్ నుంచి డ్రగ్స్ తరలించే వారు ఢిల్లీలో ఎవరితో లింక్ లు ఉన్నారనే దానిపై ఆరా తీస్తున్నారు.
Gold Rate Today: బంగారం కొంటున్నారా?.. కొత్త రేట్లు తెలుసుకోండి
