Site icon NTV Telugu

Supreme Court: బుల్డోజర్‌ చర్యలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

Supremecourt

Supremecourt

దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో జరుగుతున్న బుల్డోజర్ చర్యలపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సంచలన ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 1వ తేదీ వరకు కోర్టు అనుమతి లేకుండా దేశంలో ఎక్కడా ఆస్తులను కూల్చరాదని ధర్మాసనం ఆదేశించింది. అయితే ఈ ఉత్తర్వు పబ్లిక్ రోడ్లు, ఫుట్‌పాత్‌లు, ఇతర వాటిపై అనధికారిక నిర్మాణాలకు మాత్రం వర్తించదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నేరాలకు పాల్పడిన వ్యక్తుల ఇళ్లను లక్ష్యంగా చేసుకుని అధికారులు కూల్చివేస్తున్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ కొందరు సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. మంగళవారం జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం విచారించి తాజా ఉత్తర్వు జారీ చేశారు.

ఇది కూడా చదవండి: Purandeswari: వైజాగ్‌ స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం ఉద్దేశం అదే.. పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు

ఇదిలా ఉంటే వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న బుల్డోజర్ సంస్కృతిని ఇప్పటికే సుప్రీంకోర్టు ఖండించింది. ఇలాంటి చర్యలను గొప్పగా చేయొద్దని ప్రభుత్వాలకు వార్నింగ్ ఇచ్చింది. అయితే ఈ విషయంలో ఎన్నికల కమిషన్‌ను కూడా పిలవవచ్చని హెచ్చరించింది.

ఇది కూడా చదవండి: Delhi: ప్రధాని మోడీకి కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే లేఖ.. దేనికోసమంటే..!

మహారాష్ట్ర, జార్ఖండ్‌, జమ్మూ కశ్మీర్‌, హర్యానాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో ఈసీకి నోటీసీలు ఇస్తామని చెప్పడం ప్రాధాన్యం సంతరించుకొంది. ఈ రాష్ట్రాల్లో చాలా చోట్ల బీజేపీ అధికారంలో ఉంది. అదే సమయంలో బహిరంగ స్థలాలు, రైల్వే ఆస్తులు, నీటి వనరుల ఆక్రమణల తొలగింపు విషయంలో మాత్రం తమ ఆదేశాలు వర్తించవని తేల్చిచెప్పింది. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవే, సీయూ సింగ్‌ వాదనలు వినిపించారు. ఇప్పటికే సెప్టెంబర్‌ 2వ తేదీన జరిగిన వాదనల్లో దేశంలో ఎక్కడా ఈ తరహా చర్యల్లో మార్గదర్శకాలను పాటించడంలేదని పేర్కొన్నారు.

ఈ కేసులో ప్రధాన పిటిషనర్‌గా జామత్‌ ఉలేమా హింద్‌ వ్యవహరిస్తోంది. కూల్చివేతలకు ముందు కనీసం 40-60 రోజుల ముందుగా నోటీసులు జారీ చేయాలని, చట్ట వ్యతిరేక కూల్చివేతలకు సదరు అధికారులను బాధ్యులను చేయాలని ఆ సంస్థ సుప్రీంకు నివేదించింది. యూపీ ప్రభుత్వం పక్షాన సోలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపించారు.

Exit mobile version