West Bengal: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హృదయాన్ని కదిలించేలా ఐదేళ్ల బాలుడు రాసిన లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే, అసన్సోల్‌కు చెందిన ఐదేళ్ల బాలుడు అయితిజ్ఞా దాస్, తన తల్లి స్వాగతా పెయిన్‌ను తమ ఇంటికి దగ్గరగా ఉండేలా బదిలీ చేయాలని ఆ లేఖలో విజ్ఞప్తి చేశాడు. కాగా, స్వాగతా పెయిన్ 2021లో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం సంపాదించింది. కుటుంబానికి దాదాపు 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉత్తర దినాజ్‌పూర్ జిల్లాలో టీచర్ గా విధులు నిర్వహిస్తుంది. జాబ్ మూలంగా ఆమె ఎక్కువ కాలం కుటుంబానికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Read Also: Gurukul School: గురుకుల పాఠశాలలో 16 మంది విద్యార్థులకు అస్వస్థత.. కారణం అదే
అయితే, ఈ విషయంలో బాలుడు అయితిజ్ఞా లేటర్ రాస్తూ.. మమతా బెనర్జీని “ప్రియమైన మమతా దిదున్” అని సంబోధిస్తూ, “మా ఇల్లు అసన్సోల్‌లో ఉంది.. నా అమ్మ ఉత్తర దినాజ్‌పూర్‌లో ఉపాధ్యాయురాలుగా పని చేస్తుంది కాబట్టి మా నుండి దూరంగా ఉంటోంది.. చాలా రోజుల తర్వాత మాత్రమే ఇంటికి వస్తుంది.. నేను మా నాన్న, తాతతో ఇక్కడ ఉంటున్నాను.. అమ్మ లేకుండా జీవించడం నాకు చాలా బాధగా ఉంది.. నేను ఆమెను చాలా ప్రేమిస్తున్నాను.. దయచేసి మా అమ్మను ఇంటికి దగ్గరగా పంపించండి.. ఇకపై మా నుంచి దూరం ఉండేలా చేయకండి అని పేర్కొన్నాడు.
Read Also: Bigg Boss 9 : ఆ అల్లరి పిల్ల వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. హౌస్‌లో మజా డబుల్ అవుతుందా?
ఇక, స్వాగతా పెయిన్ మాట్లాడుతూ.. తన బదిలీ కోసం అనేక కార్యాలయాలకు లేఖలు రాసినా ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదని తెలిపారు. 2021లో నియమితులైన సుమారు 16,500 మంది ప్రాథమిక ఉపాధ్యాయులు ఇలాగే తమ ఇళ్లకు దూరంగా పదవుల్లో కొనసాగుతున్నారు.. వారందరూ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారని తెలిపింది. అలాగే, తన కొడుకు అయితిజ్ఞా అభ్యర్థన మమతా దిదున్ వింటే, ఆమెకు మళ్లీ లేఖ రాసి ధన్యవాదాలు చెబుతామని పేర్కొన్నారు. కాగా, ఈ లేఖ కేవలం ఐదేళ్ల బాలుడి కుటుంబానికే కాదు, ఇలాగే ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేలాది మంది ఉపాధ్యాయులకు కూడా ఊరట లభించవచ్చని ఆ చిన్నారి కుటుంబ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
