MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్ట్ విచారణ రేపటికి వాయిదా వేసింది. తదుపరి విచారణ రేపు మధ్యాహ్నం 12 గంటలకు హైకోర్ట్ వాయిదా వేసింది. ఈకేసుపై జస్టిస్ స్వర్ణకాంత శర్మ విచారణ జరిపారు. కవిత తరపు న్యాయవాది 40 నిమిషాల పాటు వాదనలు వినిపించారు. ఈడి, సీబీఐ రేపు వాదనలు వినిపించనున్నారు. న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణ కాంత శర్మ రేపు జడ్జిమెంట్ రిజర్వ్ చేస్తానన్నారు. కవిత భర్త అనిల్ విచారణకు హాజరయ్యారు. కవిత తరఫున సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు. మహిళను విచారణ కోసం కార్యాలయానికి పిలవకూడదన్నారు. కేసు నమోదు చేసినప్పుడు కవిత పేరే లేదన్నారు. ఈ విచారణలో సమీర్, బుచ్చిబాబు, మాగుంట నా పేరు చెప్పారన్నారు. అయితే జడ్డి మాట్లాడుతూ.. బెయిల్ కి ఉన్న గ్రౌండ్స్ ఏమిటి అని జడ్జి ప్రశ్నించారు.
Read also: Rajasthan Weather : ఫలోడీలో హాఫ్ సెంచరీ కొట్టిన ఉష్ణోగ్రతలు.. గత రికార్డులు చెరిగిపోవచ్చు
కేసు గురించి అన్ని విషయాలు తెలుసన్నారు. మరోవైపు కవితని అరెస్టు చేయాల్సిన అవసరం లేదని, దాని వల్ల ఈడి కి వచ్చి లాభం ఏమిటి ? అని కవిత తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. కవిత మాట్లాడుతూ.. నేను గత మార్చిలో వరుసగా మూడు రోజులు విచారణకు వచ్చా అన్నారు. సూర్యాస్తమయం తర్వాత కూడా నన్ను విచారించారన్నారు. నా మొబైల్ ఫోన్ ను కూడా ఇచ్చానని తెలిపారు. మహిళ ఫోన్ లో సర్చ్ చేయడం సరికాదన్నారు. రైట్ టు ప్రైవసికి భంగం కలిగించారన్నారు. కొత్త మోడల్ ఫోన్ లు రావడంతో పాత ఫోన్లు పని మనుషులకు ఇచ్చానన్నారు. ఆ ఫోన్లు పని మనుషులు ఫార్మాట్ చేశారు, నాకేం సంబంధం లేదన్నారు. కస్టడీలో ఉన్న నిందితులతో కలిపి నన్ను ఈడి విచారణ జరపలేదన్నారు. ఎన్నో చార్జిషీట్లు దాఖలు చేసినా నా పేరు ఎక్కడ ప్రస్తావించలేదన్నారు.
Read also: Sitara-Mahesh Babu: మహేష్ బాబు అసలు సీక్రెట్ చెప్పేసిన సితార!
మాగుంట శ్రీనివాసులురెడ్డి నాకు వ్యతిరేకంగా 164 స్టేట్మెంట్ ఇచ్చారన్నారు. ఆ తర్వాత 50 కోట్లు బిజెపికి ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చారని తెలిపారు. ఎన్ డి ఎ అభ్యర్థిగా పోటీ చేశారన్నారు. కవితని అరెస్టు చేయమని సుప్రీం కోర్టు కి చెప్పి ఆ తర్వాత మాట తప్పి, అరెస్టు చేశారన్నారు. సుప్రీంకోర్టులో ఈడి కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారన్నారు. రాజకీయ కారణాలతో పక్షపాత ధోరణితో ఈడి అధికారులు వ్యవహరించారన్నారు. మా వాదన వినకుండానే ఇంటరాగేషన్ కు సిబిఐ అనుమతి ఇచ్చిందన్నారు. మాకు సమాచారం లేకుండా సిబిఐ అరెస్టు చేసిందన్నారు. ఈ అంశాలపై ఎలాంటి కోర్టు ఉత్తర్వులు అప్ లోడ్ చేయలేదన్నారు. పూర్తి రహస్యం పాటించడం ఎందుకు ? అని ప్రశ్నించారు. సిబిఐ విచారణ, అరెస్టు లో చట్టపరమైన ప్రక్రియ పాటించలేదన్నారు. ఈడి కేసులో ఇప్పటివరకు ఏడు చార్జిషీట్ లు దాఖలు చేసిందన్నారు. సిబిఐ సమన్లు అన్నింటికీ సహకరించానన్నారు. మహిళను, నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, అందులో ఒకరు మైనర్ అని తెలిపారు. నేను ఒక రాజకీయ నాయకురాలినని.. బెయిల్ కు ఎలాంటి షరతులు పెట్టినా మేము అంగీకరిస్తామన్నారు.
Konathala Ramakrishna: పవన్ కళ్యాణ్ ఆశించిన ఫలితం రాబోతుంది.. ఎన్డీయే కూటమిదే గెలుపు..!