NTV Telugu Site icon

MPs Expulsion: పార్లమెంటులో బహిష్కరణకు గురైన తొలి ఎంపీ.. ఎవరంటే..!?

Untitled 1

Untitled 1

Delhi: ప్రస్తుతం హాట్ టాప్ గా మారిన విషయం తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రా పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేసి ఆమెను బహిష్కరించడం. పార్లమెంట్లో ప్రశ్నలు అడిగేందుకు నగదు తీసుకున్నారు అని ఆమె పైన వచ్చిన ఆరోపణలు నిజమని రుజువు కావడం చేత ఆమె తన పార్లమెంటులో తన సభ్యత్వాన్ని కోల్పోవాల్సి వచ్చింది. అయితే ఇలా పార్లమెంట్ సభ్యులు సభ్యత్వాన్ని కోల్పోవడం ఇది మొదటిసారి కాదు. గతంలోనూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. వివరాలలోకి వెళ్తే.. పైసాకు ప్రశ్న అనే ఆరోపణలపైనా మొదటిసారిగా 1951లో కాంగ్రెస్ నేత హెచ్‌డీ ముద్గల్ పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేయాల్సి వచ్చింది.

Read also:TS Rajiv Arogyasri Scheme: తెలంగాణలో రాజీవ్ ఆరోగ్య శ్రీ స్కీమ్.. పూర్తి వివరాలివే..

పార్లమెంట్ లో ప్రశ్నలు అడిగేందుకు వాణిజ్య సంఘాల నుంచి డబ్బు తీసుకున్నారన్న ఆరోపణలు నిజమని నిరూపణ కావడం చేత ముద్గల్ పార్లమెంట్ సభ్యత్వాన్ని కోల్పోయారు. అలానే 1976 లో అభ్యంతరక వ్యహారశైలి ఆరోపణలపై అప్పటి జన్ సంఘ నేత సుబ్రమణ్యస్వామిపై కూడా బహిష్కరణకు గురయ్యారు. ఈ కోవలోకే అప్పటి మాజీ ప్రధాని ప్రధాని ఇందిరా గాంధీ కూడా వస్తారు. ప్రత్యేక హక్కుల ఉల్లంఘన కేసులో 1978లో అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్ ఇందిరా గాంధీని లోక్‌సభ నుంచి తొలగిస్తూ ప్రవేశపెట్టిన తీర్మానానికి 279 మంది అనుకూలంగా 138 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. ఈ నేపథ్యంలో మెజారిటీ ఓట్లు ఆమెను బహిష్కరించాలని వచ్చిన నేపథ్యంలో ఇందిరా పార్లమెంట్ సంభ్యుత్వాన్ని కోల్పోయి అప్రదిష్టను మూటగట్టుకున్నారు. కాగా 2005లో పైసాకు ప్రశ్న ఆరోపణలపై ఒకే రోజున ఏకంగా 10 మంది ఎంపీలను అప్పటి పార్లమెంటు బహిష్కరించింది.