Site icon NTV Telugu

కర్ణాటకలో తగ్గిన పెట్రోల్‌, డిజీల్‌ ధరలు ఎంతంటే..

పెట్రోలు, డిజీల్‌పై కేంద్రం వరుసగా రూ.10, రూ.5 తగ్గించిన నేపథ్యంలో, కర్ణాటకప్రభుత్వం పెట్రోల్‌, డిజీల్‌పై సేల్స్ ట్యాక్స్ రేటును రూ.7 తగ్గిస్తూ, దీపావళి సందర్భంగా ప్రజలకు తీపి కబురు నందించింది. రాష్ట్రంలో డీజిల్ ధర రూ.104.50 నుంచి రూ.85.03కి తగ్గింది, రూ.19.47 తగ్గింపు’’ అని జీవో జారీ చేసింది. పెట్రోలు ధర రూ. 113.93 నుంచి రూ. 100.63కి తగ్గింది, రూ. 13.30 తగ్గింపు’’ అని ఆ జీవోలో కర్ణాటక ప్రభుత్వం పేర్కొంది. పెట్రోల్‌, డీజిల్‌పై పన్నుల్లో తమ వాటాను రూ.7 తగ్గిస్తూ కర్ణాటక ప్రభుత్వం బుధవారం నిర్ణయం తీసుకుంది.

డీజిల్, పెట్రోల్ ధరలను లీటరుకు రూ.7 తగ్గించాలని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని, దీనివల్ల ఖజానాకు రూ.2,100 కోట్ల నష్టం వాటిల్లుతుందని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై ట్విట్‌ చేశా రు. దీంతో కర్ణాటక వాటా పెట్రోల్‌పై 35% నుండి 25.9%, డీజిల్‌ పై 24% నుండి 14.34%కి తగ్గింది. పెట్రోల్, డీజిల్‌పై విధించే ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు కేంద్రం బుధవారం ప్రకటించింది. పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.10 తగ్గించిన ఎక్సైజ్ సుంకం గురువారం నుంచి అమల్లోకి వచ్చింది.

Exit mobile version