Site icon NTV Telugu

Punjab: గంటలో కోటీశ్వరుడుగా మారాడు.. ఎలాగో తెలుసా..?

Punjab

Punjab

Punjab: ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డా కానీ కోటీశ్వరులు కావడం చాలా మందికి కష్టంగా ఉంటుంది. కానీ కొందరు అనుకోకుండా కలసి వచ్చే ఆస్తులతో కోటీశ్వరులు అవుతుంటారు. కానీ గంటలో కోటీశ్వరుడు అవడం ఎక్కడైనా చూశారా? కానీ ఇక్కడ జరిగింది. గంట క్రితం వరకు ఆయనకు లక్షల్లో అప్పులు ఉన్నాయి.. కానీ గంట తరువాత అతను కోటీశ్వరుడుగా మారాడు. ఇదెలా సాధ్యం అని అనుకుంటున్నారా? అయితే ఇది చదవండి.. పంజాబ్‌లో గంటలో కోటీశ్వరుడైన వ్యక్తి స్టోరీ ఇది..

Read also: LIC Policy: ఎల్ఐసీ సూపర్ పాలసీ..రూ.54 లక్షలు పొందవచ్చు..

అదృష్టవంతున్ని ఎవరు ఆపలేరు.. దురదృష్ట వంతున్ని ఎవరు మార్చలేరనేది నానుడి.. అలాంటి ఘటన పంజాబ్లోని గురుదాస్పూర్ జిల్లాలో జరిగింది. ఓ వ్యక్తి సరదాగా లాటరీ కొన్నాడు. అదీ ఒకటి కాదు.. 25 టికెట్లు కొన్నాడు. గంటలోనే అతను కొన్న లాటరీకి కోటి రూపాయలు బహుమతి వచ్చింది. దీంతో అతడి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఆ అదృష్టవంతుడు పంజాబ్ లోని గురుదాస్పూర్ జిల్లాలో డేరా బాబా నానక్ టౌన్ కు చెందిన రూపీందర్ జిత్ సింగ్. అతను అగ్రికల్చరల్ డెవలప్మెంట్ బ్యాంకులో క్లర్కుగా పనిచేస్తున్నాడు. ఒక ఏడాదికాలంగా రూపీందర్ జిత్ సింగ్ లాటరీ టికెట్లు కొంటున్నాడు. శనివారం మధ్యాహ్నం కూడా అలాగే 12 గంటల సమయంలో నాగాలాండ్ లాటరీ టికెట్ కొన్నాడు. ఒక్కొక్కటి రూ. 6 చొప్పున.. 25 లాటరీ టికెట్లు కొన్నాడు. ఎప్పట్లాగా ఆ టికెట్లను తన దగ్గర పెట్టుకున్నాడు తరువాత బ్యాంకుకు వచ్చి.. బ్యాంకు పనిలో పడిపోయాడు. ఏడాదిగా లాటరీలు కొంటున్నా ఎలాంటి ఫలితం లేకపోవడంతో దానిమీద పెద్దగా మనసు పెట్టలేదు.

Read also: ATM AC Robbery: ఏటీఎం మెషిన్‌, డబ్బు వదిలేసి.. ఏసీ ఎత్తుకెళ్లిపోయిన దుండగులు!

ఓ గంట తర్వాత లాటరీ ఏజెంట్ నుంచి ఫోన్ వచ్చింది. ‘మీరు కోటి రూపాయలు గెలుచుకున్నా’రని చెప్పాడు. దీంతో ఒక్కసారిగా షాక్ అయిన రూపేందర్ ఆ తర్వాత సంతోషంతో ఉబ్బితబ్బైపోయాడు. విషయం తెలియడంతో బ్యాంకు సిబ్బంది రూపీందర్ జిత్ సింగ్ ను అభినందనల్లో ముంచెత్తారు. ఇదంతా కలలాగా ఉందంటూ రూపీందర్ జిత్ సింగ్ అంటున్నాడు. తాను గెలుచుకున్న ఈ మొత్తాన్ని తన పిల్లల కోసం, కుటుంబ భవిష్యత్తు కోసం ఖర్చు చేస్తానని.. అందులో కొంత మొత్తాన్ని పేదల కోసం వాడతానన్నాడు. దీంతో లాటరీలు కొనే వారిలో డేరా బాబా నానక్ టౌన్ పేరు మరోసారి మారుమోగిపోయింది. ఎందుకంటే కొద్దికాలం క్రితం ఇక్కడే ఓ కిరాణా దుకాణ యజమానికి కూడా లాటరీలో రూ.2.5 కోట్లు దక్కాయి.

Exit mobile version