Site icon NTV Telugu

Prajwal Revanna Case: ప్రజ్వల్ రేవణ్ణ పారిపోవడానికి దేవెగౌడ సహకరించాడు: సీఎం సిద్ధరామయ్య

Prajwal Revanna Case

Prajwal Revanna Case

Prajwal Revanna Case: మాజీ జేడీఎస్ నేత, ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ టేపుల కేసులో అధికార కాంగ్రెస్, జేడీఎస్ పార్టీని టార్గెట్ చేస్తోంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ప్రజ్వల్ రేవణ్ణ ఇండియా నుంచి జర్మనీకి పారిపోయేందుకు ఆయన తాత, మాజీ ప్రధాని దేవెగౌడ సహకరించారని సీఎం సిద్ధరామయ్య ఆరోపించారు. ‘‘దేవెగౌడ స్వయంగా ప్రజ్వల్‌ని పంపారని నేను అనుకుంటున్నాను. ప్రస్తుతం ఆయన రాసిన లేఖ ప్రజలు చూసేందుకు మాత్రమే’’ అని ఆయన అన్నారు. గురువారం దేవెగౌడకు ఎక్స్ వేదికగా ప్రజ్వల్ రేవణ్ణకు లేఖ రాశారు. వెంటనే ఇండియా తిరిగి వచ్చి పోలీసుల ముందు లొంగిపోవాలని, లేకుంటే నా ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని లేఖలో ఆయన పేర్కొన్నారు. తన సహనాన్ని పరీక్షించొద్దని ఆయన హెచ్చరించారు.

Read Also: Shamshabad Airport: విమానంలో యువకుడి హల్ చల్.. ల్యాండిగ్ అవుతుండగా డోర్ ఓపెన్ చేసేందుకు యత్నం

గత నెలలో ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన వేల సంఖ్యలో సెక్స్ టేపులు వెలుగులోకి వచ్చాయి. హసన్ జిల్లాలో పాటు కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో ఈ వీడియోలు వైరల్ అయ్యాయి. రేవణ్ణ ఇంట్లో పనిచేసే మహిళ, ప్రజ్వల్ రేవణ్ణతో పాటు ఆయన తండ్రి హెచ్‌డీ రేవణ్ణలపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేసింది. ఈ పరిణామాల అనంతరం ప్రజ్వల్ ఇండియా నుంచి జర్మనీ పారిపోయాడు. ఈ కేసును విచారించేందుకు కర్ణాటక ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం ప్రజ్వల్‌కి లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. ఇదిలా ఉంటే ఇటీవల ప్రజ్వల్ దౌత్య పాస్‌పోర్టు రద్దు చేయాలని కోరుతూ సీఎం సిద్ధరామయ్య, ప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాశారు. కేంద్రం కూడా ప్రజ్వల్ రేవణ్ణ దౌత్య పాస్‌పోర్టు రద్దు ప్రక్రియకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభించినట్లు తెలుస్తోంది.

Exit mobile version