Mahua Moitra: చిక్కుల్లో ఎంపీ మహువా మోయిత్రా.. వివాదానికి దూరంగా తృణమూల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahua Moitra: పార్లమెంట్‌లో ప్రశ్నలు అడగటానికి లంచం తీసుకున్నారనే ఆరోపణల్ని ఎదుర్కొంటున్నారు తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎంపీ మహువా మోయిత్రా. అదానీ గ్రూపుపై పార్లమెంట్ లో ప్రశ్నలు లేవనెత్తడానికి వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి డబ్బులు తీసుకున్నారని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై విచారణ జరపాలని ఇప్పటికే లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాకు లేఖ రాశారు. దీంతో పాటు ఎంపీగా ఉన్న మోయిత్రా తన లోక్ సభ లాగిన్ ఐడీని ఇతరులకు ఇచ్చినట్లు ఆరోపణలు చేస్తే కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కి కూడా లేఖ రాశారు.
ఈ నేపథ్యంలో తాజాగా వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ సంతకం చేసిన అఫిడవిట్ ను పార్లమెంట్ ఎథిక్స్ కమిటికీ పంపడం ఈ కేసులో సంచలనంగా మారింది. ప్రధాని మోడీని టార్గెట్ చేసుకుని విమర్శించేందుకు అదానీ గ్రూపుపై ప్రశ్నలు అడిగిందని, తనతో చేయకూడని పనులు చేయించిందని, విలువైన గిఫ్టులను తీసుకునేదని లేఖలో ఆరోపించాడు.
Also Read
- Supreme Court: ట్రాఫిక్ చలాన్లు ఎగ్గొడుతున్నారా? అయితే కరెంట్ బిల్‌తో కలిపేయండి! సుప్రీంకోర్టు ఊహించని సలహా..
- NEET UG 2027: గుడ్ న్యూసా? బ్యాడ్ న్యూసా?.. నీట్ 2027 ప్యాటర్న్ పూర్తిగా మారబోతోందా?
- Supreme Court: యూపీఐ ఛార్జీలపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం..
- Tax Raids: రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఐటీ సోదాలు.. హీరోయిన్‌పై సంచలన ఆరోపణలు..
Read Also: Big Car Key: కారు కొనుగోలు చేసినప్పుడు పెద్ద “కీ” ఎందుకు ఇస్తారో తెలుసా..?
ఇదిలా ఉంటే ఈ వివాదంలో కలుగజేసుకునేందుకు తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నిరాకరిస్తోంది. పార్టీ ఎంపీ అయిన మహువా మోయిత్రాకు మద్దతు ఇవ్వడం లేదని తెలుస్తోంది. ఈ వివాదానికి దూరంగా ఉండటమే మంచిదని టీఎంసీ భావిస్తోంది. ఈ అంశంపై పార్టీ చెప్పేదేం లేదని, ఈ వివాదం ఎవరి చుట్టూ తిరుగుతుందో వారే స్పందిస్తారని టీఎంసీ పశ్చిమబెంగాల్ ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ అన్నారు. టీఎంసీ మరో నాయకుడు మాట్లాడుతూ.. ఈ వివాదంలోకి రావడానికి పార్టీ ఇష్టపడటం లేదని అన్నారు.
ఈ పరిణామాలపై ప్రతిపక్ష బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. టీఎంసీ లీడర్లు అరెస్టు అయిన సందర్భాల్లో టీఎంసీ తన బాధ్యతల నుంచి తప్పించుకుంటోందని, మహువా మోయిత్రాకు మద్దతిస్తుందా..? లేదా..? అనేది టీఎంసీ వివరించాలని బీజేపీ నేత రాహుల్ సిన్హా అన్నారు
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!